Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో తల్లి పోరాటం.. పసిబిడ్డకు పాలు ఇచ్చి కాపాడిన నర్స్

నిర్మల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు ఉద్యోగరీత్యా రెండు నెలల శిశువుతో కర్ణాటక వెళ్లారు. అక్కడి బ్యాంకులో పనిచేస్తున్న భర్తకు నెల కిందట కరోనా పాజిటివ్ రావడంతో.. వారిని పుట్టింటివారు భైంసా తీసుకువచ్చారు. 

Nurse feed corona patient baby in Bhaimsa
Author
Hyderabad, First Published May 22, 2021, 7:53 AM IST

కరోనా మహమ్మారి మనదేశంలో ఎంతలా విలయ తాండవం చేస్తోందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి సోసి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో ఎదుటివారికి సహాయం చేసేందుకు ఎవరూ కనీసం ముందుకు కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పసికందుకు నర్స్ తల్లిగా మారింది. తన చనుభాలు ఇచ్చి.. బిడ్డ ఆకలితీర్చింది. ఈ సంఘటన భైంసా పట్టణంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిర్మల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు ఉద్యోగరీత్యా రెండు నెలల శిశువుతో కర్ణాటక వెళ్లారు. అక్కడి బ్యాంకులో పనిచేస్తున్న భర్తకు నెల కిందట కరోనా పాజిటివ్ రావడంతో.. వారిని పుట్టింటివారు భైంసా తీసుకువచ్చారు. అంతలోనే భార్యకు, ఆమె తల్లిదండ్రులకు సైతం కరోనా సోకింది.

బ్యాంకు ఉద్యోగి, అతని భార్య మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ లో, భార్య తల్లిదండ్రులు భైంసా ఆస్పత్రిలో చేరారు. వారి వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్న మహేందర్ బాధితులకు సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో దంపతుల మూడు నెలల బాలుడిని చూసకునేవారు లేకుండా పోయారు. 

కాగా.. భైంసా ప్రాంతీయ ఆష్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న డ్రైవర్ మహేంద్ర భార్య సునీత.. వారి బాధను పెద్ద మనసుతో అర్థం చేసుకుంది. ఆ నెలల పసికిందను తన ఇంటికి తెచ్చుకొని.. తన చనుభాలను ఆ బిడ్డకు పట్టి.. ఆకలి తీర్చింది. ఆమె పెద్ద మనసుకు అందరూ ఫిదా అయిపోయారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios