Asianet News TeluguAsianet News Telugu

కరోనా కష్టకాలంలో తెలంగాణకు సాయం..: నారా భువనేశ్వరి కీలక ప్రకటన

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చింది. 

NTR trust to set up Oxygen plant at telangana... nara bhuvaneshwari akp
Author
Hyderabad, First Published Jun 1, 2021, 1:05 PM IST

హైదరాబాద్: ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తమ వంతు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేసిన ఈ ట్రస్ట్ మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చింది. తెలంగాణలో మరో రెండు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రకటించారు.

''ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు దాతల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. దాతలందరికీ పేరుపేరునా అభినందనలు. ఇప్పటికే అనాధ శవాల అంతిమ సంస్కారాలకు ట్రస్ట్ సేవావిభాగం ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా టెలీమెడిసిన్, మందుల పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 24/7 కాల్ సెంటర్ ద్వారా కరోనా రోగులకు నిరంతర సేవలు అందిస్తున్నాం'' అని భువనేశ్వరి తెలిపారు. 

read more  రాబోయే రోజుల్లో... రాష్ట్ర పరిస్థితి మరింత దారుణ స్థితికి: యనమల ఆందోళన

ఇప్పటికే ఏపీలోని రేపల్లె, పాలకొల్లు, కుప్పం, టెక్కలి పట్టణాల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను నెలకొల్పుతామని భువనేశ్వరి తెలిపారు. హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభిస్తామని ఆమె వెల్లడించారు. అలాగే ఇంటివద్ద హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల కోసం 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఎన్టీఆర్ ట్రస్ట్ అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు.

మరోవైపు కరోనా బాధితుల కోసం విదేశీ వైద్యులతో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆన్ లైన్ సేవలకు అనూహ్య స్పందన లభిస్తోందని భువనేశ్వరి పేర్కొన్నారు. ఆన్ లైన్ టెలీ మెడిసిన్, ఉచితంగా మందుల పంపిణీ, కోవిడ్ బాధితులకు అన్నదానం వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు.  

ఇక కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వివిధ ఆసుపత్రుల్లో సరైన వైద్య సేవలు అందకపోవడం, కొన్నిచోట్ల కరోనాతో మృతిచెందిన వారిని పట్టించుకోకుండా రోడ్ల పక్కన వదిలివేయడం పట్ల తాను కలత చెందానన్నారు భువనేశ్వరి. ఇలాంటి వారి చివరి మజిలీ గౌరవ ప్రదంగా సాగేలా చర్యలు చేపట్టామని... ఇందుకోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసినట్లు నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios