ఎన్టీఆర్‌ విగ్రహం విరిగి రోడ్డుపై పడిపోయుంది. ఇది గమనించిన స్థానిక టీడీపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ సందీప్‌పై బాలానగర్‌ పోలీసులకు అప్పగించారు

టీడీపీ వ్యవస్థాపకులు, సీనియర్ నటుడు దివంగత ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసమయ్యింది. హైదరాబాద్‌లోని బాలానగర్‌ ప్రధాన రహదారిపై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓ కారు ఢీ కొట్టింది. కొద్ది రోజుల క్రితం రాజీవ్‌, పీజేఆర్‌, అంబేద్కర్‌, జగ్జీవన్‌రాం విగ్రహాలు వాహనాలు ఢీకొనడంతో ధ్వంసమ య్యాయి.

 ఈ సంఘటనల మరువక ముందే బుధవారం రాత్రి 9.15 గంటల సమయంలో సికింద్రాబాద్‌ నుంచి కూకట్‌పల్లి వైపునకు వెళ్తున్న టీఎస్‌ 08 యూడీ 6860 నంబరు గల కారు మార్గమ్యధలోని ఫిరోజ్‌గుడా వద్ద రోడ్డు మధ్యలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఢీకొట్టింది. దీంతో ఎన్టీఆర్‌ విగ్రహం విరిగి రోడ్డుపై పడిపోయుంది. ఇది గమనించిన స్థానిక టీడీపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ సందీప్‌పై బాలానగర్‌ పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌పై బాలానగర్‌ సీఐ కిషన్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.