అమెరికాలో బోటింగ్ విషాదం: తెలంగాణ ఎన్నారై మృతి

NRI dies in USA in a boating accident
Highlights

అమెరికాలోని ఉత్తర టెక్సాస్ లో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ప్రమాదంలో మరణించారు.

డల్లాస్: అమెరికాలోని ఉత్తర టెక్సాస్ లో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ప్రమాదంలో మరణించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి (40) ప్రమాదవశాత్తు మరణించారు. వారంతంలో కుటుంబ సభ్యులతో కలిసి శనివారం గ్రేప్ వైన్ సరస్సులో బోటింగ్ చేయడానికి వెళ్లారు. 

పొంటూన్ బోటు నుంచి ఈత కొట్టడానికి నీళ్లలోకి దూకాడు. కానీ ఎంతకూ అతను పైకి రాలేదు. దీంతో రెస్క్యూ టీమ్ కు సమాచారం అందించారు. నీళ్లలో మునిగిని అతని కోసం రెస్క్యూ టీమ్ గాలించింది. చివరకు 24 గంటల తర్వాత ఆదివారంనాడు అతని మృతదేహం బయటపడింది. 

ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 12 మంది ఉన్ారు వెంకట్రామిరెడ్డి డల్లాస్ లో గ్లోబల్ ఐటి కంపెనీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వాణి కూడా ఉద్యోగిని. అతని మృతదేహం వారం రోజుల్లో స్వేదశానికి వస్తుందని భావిస్తున్నారు. 

అదే సరస్సులో ఆదివారం జరిగిన మరో ప్రమాదం కూడా జరిగింది. సరస్సులో మునిగిన పాతికేళ్ల యువకుడిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అతనికి బెయిలర్ స్కాట్ అండ్ వైట్ మెడికల్ సెంటర్ లో చికిత్స అందిస్తున్ారు. లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లే ఈ రెండు ప్రమాదాలు సంభవించాయి.

loader