మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని పంజాబ్‌కు చెందిన మల్‌రాజ్ సింగ్‌గా గుర్తించారు. తొలుత సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టిన అతడు.. తర్వాత ఆమెను కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు.
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని పంజాబ్‌కు చెందిన మల్‌రాజ్ సింగ్‌గా గుర్తించారు. వివరాలు.. పంజాబ్‌లోని అమృత్‌సర్ ప్రాంతానికి చెందిన మల్‌రాజ్ సింగ్ కాలిఫోర్నియాలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి గ్రీన్‌కార్డు సైతం ఉంది. పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారికి అతడు సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు పంపుతున్నాడు. ఆమె ఫొటోలు సోషల్ మీడియా నుంచి తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.
అయితే రెండు నెలల క్రితం ఆ ట్రైనీ ఐపీఎస్ అధికారిణి.. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహిస్తున్న శిక్షణలో పాల్గొంటున్నారు. అక్కడే ఓ హాస్టల్‌లో ఉంటున్నారు. అయితే మల్‌రాజ్.. ఆమె కోసం ఇటీవల పంజాబ్‌కు వచ్చాడు. ఆమె హైదరాబాద్‌లో ఉందని తెలుసుకుని.. గత నెల 1వ తేదీన ఎంసీహెచ్‌ఆర్‌డీకి వెళ్లాడు. అక్కడ ఆమెతో మాట్లాడేందుకు మల్‌రాజ్ ప్రయత్నించాడు. అయితే అందుకు ఆమె నిరాకరించడంతో బెదిరించడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలోనే మెసేజ్‌లు పంపుతూ వేధించసాగాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని ఎంసీహెచ్‌ఆర్‌డీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. అతడిని అరెస్ట్ చేసి.. జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అతడిపై ఐపీసీలోని 509, 354డీ, 452 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.
