Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : నామినేషన్ల దాఖలుకు ముగిసిన గడువు.. లాస్ట్ మినిట్‌లో అభ్యర్ధుల పరుగులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. సమయం మించి పోవడంతో కొందరు అభ్యర్ధులు పరుగులు తీశారు. 

nominations time completed for telangana elections ksp
Author
First Published Nov 10, 2023, 3:51 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ వేసేందుకు ఆర్వో కార్యాలయానికి వెళ్లి క్యూలో వున్న అభ్యర్ధులకు అధికారులు  అవకాశం కల్పించారు. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. సమయం మించి పోవడంతో కొందరు అభ్యర్ధులు పరుగులు తీశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన, 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి. 

గురువారం ఒక్కరోజే 1133 నామినేషన్లు దాఖలు కాగా.. నిన్నటి వరకు 2478 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం మంచి రోజు కావడంతో ఎక్కువ మంది నామినేషన్లు సమర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా హేమాహేమీలు నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా నేతల ఆస్తులు, అప్పులు, కేసుల వంటి వాటిని తెలుసుకునేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. 

ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ఆస్తులు, అప్పులు ప్రకటించారు. ఈసారి కొడంగల్, కామారెడ్డిల నుంచి ఆయన బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్లా నామినేషన్ దాఖలు చేసిన ఆయన తనకు సంబంధించిన కీలక వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు.

ALso Read: లక్షలు విలువ చేసే 2 తుపాకులు.. 89 కేసులు, రేవంత్ రెడ్డి ఆస్తులు , అప్పులూ కోట్లలోనే ..?

ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్న దాని ప్రకారం రేవంత్ రెడ్డి వద్ద రూ.5,34,000 నగదు వుందట. అలాగే రేవంత్, ఆయన భార్య గీతా రెడ్డి పేర్ల మీద కలిపి వున్న స్థిర , చర ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ.30,95,52,652గా ఆయన ప్రకటించారు. అలాగే రేవంత్ రెడ్డిపై 89 పెండింగ్ కేసులున్నాయట. ఆయన వద్ద రూ.2 లక్షల విలువ చేసే పిస్టల్, రూ.50 వేల విలువ చేసే రైఫిల్ ఉన్నట్లుగా రేవంత్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

అలాగే రేవంత్ దంపతుల పేర్ల మీద రూ.1,30,19,901 మేర అప్పులు వున్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. అలాగే టీపీసీసీ చీఫ్ వద్ద ఒక హోండా సిటీ, మరో మెర్సిడిస్ బెంజ్ వున్నాయట. రేవంత్ రెడ్డి భార్య వద్ద రూ. 83,36,000 విలువైన 1,235 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలు.. రూ.7,17,800 విలువైన 9,700 గ్రాముల వెండి, వెండి వస్తువులు కూడా వున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios