జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 1,889  నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. శుక్రవారం ఒక్కరోజే 1,223 నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్ధులు. మొత్తం 150 వార్డులకు బరిలో 1,421 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.

వీరిలో స్వతంత్ర అభ్యర్ధులు 454 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి 428, టీఆర్ఎస్ 424, కాంగ్రెస్ 275, టీడీపీ 155, ఎంఐఎం 58, సీపీఎం 17, సీపీఐ 12, ఇతరులు 66 నామినేషన్లు వేశారు. 

మరోవైపు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రూ.62.21 లక్షల నగదు సీజ్ చేశారు. 11 ఘటనలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

Also Read:బండి సంజయ్ వైఖరి: పవన్ కల్యాణ్ గుస్సా, రంగంలోకి బిజెపి పెద్దలు

1,899 మంది ఆయుధాలు డిపాజిట్ చేశారని, ఇప్పటివరకు 2,393 మందిని బైండోవర్ చేశామని పేర్కొంది. 148 మందికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ జారీ చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పరిశీలకులుగా ఐదుగురు ఐపీఎస్‌ అధికారులు నియమితులయ్యారు. ఈ మేరకు సీపీ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శిఖా గోయల్ (ఈస్ట్‌ జోన్), అనిల్‌కుమార్ (వెస్ట్ జోన్), చౌహన్ (సౌత్ జోన్), అవినాష్ మొహంతి (నార్త్‌ జోన్), తరుణ్‌ జోషి (సెంట్రల్ జోన్)లను నియమించారు.