Telangana : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రైతాంగానికి విద్యుత్ కోతలు ఏర్పడ్డాయి. అయితే, సమాచారం లోపంతోనే ఈ సమస్య ఏర్పడిందనీ, 24 ఉచిత విద్యుత్ రైతులకు అందుబాటులో ఉంటుందని టీఎస్ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు.
Telangana : దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యుత్ కోతలు మొదలయ్యాయి. దీంతో రైతులు ఇబ్బందులు మరింతగా పెరిగాయి. ఇక తెలంగాణలోనూ విద్యుత్ కోతలు విధించారు. అయితే, సమాచారం లోపంతోనే ఈ సమస్య ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు. వివరాల్లోకెళ్తే.. రాష్ట్రంలో గురువారం నాడు కొన్ని ప్రాంతాల్లో అనివార్య కారణాల వల్ల వ్యవసాయ రంగంకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఎన్పీడీసీఎల్ సంస్థలో నిన్న కొంత సమాచార లోపం తో వ్యవసాయ రంగం కు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడిందనీ, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కోతలు విధించే నిర్ణయం తీసుకోలేదని అధికారులు పేర్కొంటున్నారు. శుక్రవారం నుంచి రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా యధావిధిగా ఉంటుందని టీఎస్ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. ఇప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదని తెలిపారు.
విద్యుత్ కోతలు, కరెంట్ కట్ లు ఉంటాయని రాష్ట్ర రైతన్నలు ఎవరు కూడా ఆందోళన చెందల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇన్ని రోజులు ఏ విధంగా 24 గంటల విద్యుత్ సరఫరా కొనసాగిందో ముందు కూడా అలానే ఉంటుందని టీఎస్ ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.
