Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: హైద్రాబాద్‌లో సామూహిక గణేష్ విగ్రహల నిమజ్జనానికి బ్రేక్

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది గణేష్ విగ్రహల సామూహిక నిమజ్జనం ఉండదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది.
 

No Mass immersion of Ganesh idols this year due to corona
Author
Hyderabad, First Published Jul 27, 2020, 3:51 PM IST


హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది గణేష్ విగ్రహల సామూహిక నిమజ్జనం ఉండదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది.

కరోనా నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తును 27 అడుగులకు తగ్గించారు. లడ్డు వేలాన్ని ఈ ఏడాది నిర్వహించడం లేదని బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటి ఇదివరకే ప్రకటించింది.

సెప్టెంబర్ 1వ తేదీన వినాయక విగ్రహల నిమజ్జనం చేయాలని గణేష్ ఉత్సవ సమితి నిర్ణయం తీసుకొంది. అయితే గతంలో మాదిరిగా సామూహిక గణేష్ విగ్రహల నిమజ్జనం ఉండదని ఉత్సవ సమితి సోమవారం  నాడు ప్రకటించింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ఈ విషయాన్ని ఇవాళ మీడియాకు తెలిపారు.

also read:కరోనా దెబ్బ: బాలాపూర్ గణేషుడి లడ్డు వేలం రద్దు

నగరంలో ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడే వినాయక విగ్రహలను నిమజ్జనం చేయాలని ఉత్సవ కమిటి సూచించింది. వినాయక మండపాల వద్ద సామాజిక దూరం పాటించాలని ఉత్సవ కమిటి కోరింది. విగ్రహల నిమజ్జనం సమయంలో నలుగురైదుగురు మాత్రమే ఉండాలని కమిటి తెలిపింది.శానిటైజర్లు, మాస్కులను కచ్చితంగా వాడాలని కూడ కమిటి సూచించింది.

ఈ ఏడాది ఆగష్టు  22వ తేదీన గణేష్ చతుర్థి. సెప్టెంబర్ 1వ తేదీన వినాయక విగ్రహలను నిమజ్జనం చేయాలని ఉత్సవ కమిటి నిర్ణయం తీసుకొంది. సాధారణంగా హైద్రాబాద్ లో గణేస్ నిమజ్జనానికి కనీసం రెండు రోజులకు పైగా సమయం పట్టనుంది. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది సామూహిక వినాయక విగ్రహల నిమజ్జనం చేయకూడదని ఉత్సవ కమిటి నిర్ణయం తీసుకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios