కరోనా దెబ్బ: బాలాపూర్ గణేషుడి లడ్డు వేలం రద్దు
ఖైరతాబాద్ గణేషుడితో పాటు బాలాపూర్ వినాయకుడికి కూడ కరోనా సెగ తగిలింది. కేవలం ఆరు అడుగుల విగ్రహం మాత్రమే ఏర్పాటు చేయాలని బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటి నిర్ణయం తీసుకొంది.
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేషుడితో పాటు బాలాపూర్ వినాయకుడికి కూడ కరోనా సెగ తగిలింది. కేవలం ఆరు అడుగుల విగ్రహం మాత్రమే ఏర్పాటు చేయాలని బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటి నిర్ణయం తీసుకొంది. మరో వైపు ఈ ఏదాది లడ్డు వేలాన్ని కూడ రద్దు చేయాలని ఉత్సవ కమిటి నిర్ణయించింది.
వినాయకచవితి వచ్చిందంటే హైద్రాబాద్ తో పాటు తెలంగాణలో సందడి వాతావరణం ఉండేది. హైద్రాబాద్ నగరంలో వేలాది గణేష్ విగ్రహలు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా గణేష్ విగ్రహలు ఏర్పాటు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఈ ఏడాది 27 అడగులకు కుదించారు.
also read:కరోనా ఎఫెక్ట్: ఈ ఏడాది 27 అడుగులకే ఖైరతాబాద్ వినాయక విగ్రహం
ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ గణేషుడికి నగరంలో బాగా క్రేజీ ఉంటుంది. ఈ విగ్రహం వద్ద నవరాత్రుల పాటు పూజలు చేసిన లడ్డు వేలం సాగుతోంది.ఈ లడ్డును లక్షల రూపాయాలు పెట్టి కొనుగోలు చేస్తుంటారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది బాలాపూర్ లడ్డు వేలాన్ని కూడ రద్దు చేశారు. విగ్రహాన్ని కేవలం 6 అడుగులకే పరిమితం చేసింది ఉత్సవ కమిటి.బాలాపూర్ గణేషుడిని దర్శనానికి భక్తులకు అనుమతి కూడ లేదని ఉత్సవ కమిటి ప్రకటించింది.
రాష్ట్రంలోనే బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాటకు చరిత్ర ఉంది. బాలాపూర్ లడ్డు వేలం పాట 1994లో ప్రారంభమైంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిగా ఏర్పాటై బాలాపూర్ లో గణేష్ వినాయక విగ్రహన్ని ఏర్పాటు చేసి లడ్డు వేలం పాటను నిర్వహిస్తున్నారు. బాలాపూర్ లడ్డును అత్యధికంగా కొలను కుటుంబీకులు దక్కించుకొన్నారు.బాలాపూర్ కు చెందిన కొలను కుటుంబీకులు 9 దఫాలు ఈ లడ్డును వేలంపాటలో దక్కించుకొన్నారు.
తొలిసారి 1994లో జరిగిన వేలం పాటలో కొలను మోహన్ రెడ్డి కుటంబం రూ.450 దక్కించుకొంది. 1995లో కూడ కొలనుమోహాన్ రెడ్డి కుటుంబం రూ4500లకు లడ్డును దక్కించుకొంది. 1996లో కొలను కృష్ణారెడ్డి రూ.18వేలకు దక్కించుకొన్నారు. 1997లో కొలను కృష్ణారెడ్డి రూ.28వేలకు దక్కించుకొన్నారు. 1998లో కొలను మోహన్ రెడ్డి రూ. 51వేలకు దక్కించుకొన్నారు.1998లో కళ్లెం ప్రతాప్ రెడ్డి రూ.65వేలకు లడ్డును దక్కించుకొన్నారు.
1999లో కళ్లెం అంజిరెడ్డి రూ.66వేలకు లడ్డును దక్కించుకొన్నారు.2000లో జి. రఘునందన్ చారి రూ.85వేలకు లడ్డును దక్కించుకొన్నారు.2001లో కందాడ మాధవరెడ్డి రూ.1.05లక్షలకు లడ్డును దక్కించుకొన్నాడు.2002లో చిగురంత తిరుపతిరెడ్డి రూ.1.55లక్షలకు లడ్డును దక్కించుకొన్నాడు. 2003లోకొలను మోహన్ రెడ్డి రూ.2.01లక్షలకు లడ్డును దక్కించుకొన్నాడు.
2004లోఇబ్రహీం శేఖర్ రూ.2.08లక్షలకు లడ్డును దక్కించుకొన్నాడు. 2005లో చిగురంత తిరుపతి రెడ్డి రూ.3 లక్షలకు లడ్డును దక్కించుకొన్నాడు. 2006లో జి.రఘునందన్ చారి రూ.4.15లక్షలకు దక్కించుకొన్నాడు.2007లో కొలను మోహన్ రెడ్డి రూ. 5.07 లక్షలకు లడ్డును దక్కించుకొన్నారు.2008లో సరిత రూ.5.10లక్షలకు దక్కించుకొన్నారు.
2009లో కొడలి శ్రీధర్ బాబు రూ. 5.35లక్షలకు దక్కించుకొన్నారు.2010లో కొలను బ్రదర్స్ కు రూ. 5.45లక్షలకు దక్కించుకొన్నారు. 2011లో రూ.పన్నాల గోవర్థన్ రూ. 7.50లక్షలకు దక్కించుకొన్నారు. 2012లో తీగల కృష్ణారెడ్డి రూ.9.26లక్షలకు లడ్డును దక్కించుకొన్నారు.2013లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి రూ. 9.50లక్షలను లడ్డును దక్కించుకొన్నారు.
2014లో కళ్లెం మదన్ మోహాన్ రెడ్డి రూ. 10.32 లక్షలకు లడ్డును దక్కించుకొన్నారు. 2015లో స్కైలాబ్ రెడ్డి రూ. 14.65లక్షలకు దక్కించుకొన్నారు. 2016లో నాగం తిరుపతి రెడ్డి రూ.15.60 లక్షలకు దక్కించుకొన్నారు. ఈ ఏడాది శ్రీనివాస్ గుప్తా రూ.16.60లక్షలకు దక్కించుకొన్నారు.
మొదట్లో 1994 సంవత్సరం కోలన్ మోహన్ రెడ్డి 450/- తో ప్రారంభమైన బాలాపూర్ గణేష్ లడ్డూ ఇరవై నాలుగు సంవత్సరాలలో 15 లక్షల 50 వేల వరకు పలికింది. ఎంతో కలిసొస్తుందని నమ్మకంతో భక్తులు ఏట బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటలో పాల్గొన్ని కైవసం చేసుకుంటున్నారు... అత్యధికం గా 8 సార్లు బాలపూర్ గ్రామానికి చెందిన కోలన్ కుటుంబీకులు వేలం పాటలో లడ్డు కైవసం చేసుకున్నారు..............
1) కోలన్ మోహన్ రెడ్డి 450/ - 1994.
2 కోలన్ మోహన్ రెడ్డి 4500/ -. 1995.
3)కోలన్ కృష్ణారెడ్డి 18000 /-. 1996.
4)కోలన్ కృష్ణారెడ్డి 28000/- 1997.
5) కోలన్ మోహన్ రెడ్డి 51000/ - 1998.
6) కళ్ళెం ప్రతాప్ రెడ్డి 65000/- 1999.
7) కళ్ళం అంజి రెడ్డి 66000/- 2000.
8)G. రఘునందన్ చారి 85000/- 2001.
9) కందాడ మాధవరెడ్డి 105000/- 2002.
10) చిగురంత బాల్ రెడ్డి 1,55000/- 2003.
11) కోలన్ మోహన్ రెడ్డి 2,01000 2004.
12) ఇబ్రహీం శేఖర్ 2,08000 2005.
13)చిగురంత తిరుపతి రెడ్డి 300000 2006.
14)G.రఘునందన్ చారి 4,15000/- 2007.
15) కోలన్ మోహన్ రెడ్డి 5,07000/- 2008.
16) సరిత 510000/- 2009.
17) కోడలి శ్రీధర్ బాబు 535000/- 2010.
18) కోలన్ బ్రదర్స్ 545000/- 2011.
19)పన్నాల గోవర్ధన్ 750000/- 2012.
20)తీగల కృష్ణ రెడ్డి 926000/- 2013.
21) సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 950000/- 2014.
22)కళ్లెం మదన్ మోహన్ రెడ్డి 1032000/- 2015.
23) స్కైల్యాబ్ రెడ్డి 14,65000 /- 2016.
24) నాగం తిరుపతి రెడ్డి 1560000 /- 2017.
25) 16.60000 /- లక్షలు రూపాయలు పలికిన శ్రీనివస్ గుప్తా.-2018
26) కొలను రాంరెడ్డి. 17.50 లక్షలు -2019