కొత్తగూడెం: పారెస్ట్ అధికారులను తాను బెదిరించలేదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడిన ఆడియో సోషలో మీడియాలో వైరల్ కావడంతో  వనమా వెంకటేశ్వరరావు మాట మార్చారు.

మంగళవారం నాడు మధ్యాహ్నం ఆయన ఈ విషయమై స్పందించారు. అధికారులు సంయమనంతో ఉండాలని కూడ కోరానని చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టవద్దని  మాత్రమే కోరినట్టుగా  ఆయన వివరణ ఇచ్చారు.  ఈ విషయానికే తనపై కేసు పెట్టారని వనమా వెంకటేశ్వరరావు చెప్పారు.

తాను ఫారెస్ట్ అధికారులను బెదిరించలేదన్నారు. ఆదివాసీలకు న్యాయం చేయాలని మాత్రమే తాను కోరినట్టుగా ఆయన వివరణ ఇచ్చారు. ఈ విషయమై కోర్టుకు వెళ్లినా కూడ  తానే విజయం సాధిస్తాననే ధీమాను వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులపై దౌర్జన్యం చేసినట్టుగా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అటవీ అధికారులపై దాడి: ఆడియో లీక్, చిక్కుల్లో ఎమ్మెల్యే వనమా

మరో అటవీ శాఖ అధికారిపై దాడి