కాగజ్ నగర్ ఘటన మరవకముందే భద్రాద్రి లో మరో ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కాగజ్ నగర్ లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ  అటవీ శాఖ మహిళా అధికారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అలాంటి సంఘటనే మరోకటి చోటుచేసుకుంది.

భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడులో పోడు భూముల్లో సాగు చేయడాన్ని అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి గిరిజనులు అటవీశాఖ అధికారులపై దాడి జరిపారు.
 
సెక్షన్‌ ఆఫీసర్‌ నీలమయ్య, బీట్‌ ఆఫీసర్‌ భాస్కరరావు వాళ్ల ట్రాక్టర్లను ఆపి ప్రశ్నించే సమయంలో ఒక్కసారిగా వాళ్లంతా అధికారులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరి అధికారుల వీపుపై గాయాలయ్యాయి. అక్కడనుంచి తప్పించుకున్న అటవీ అధికారులు ముల్కలపల్లి పోలీసుస్టేషన్‌లో మంగళవారం ఉదయం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుమన్‌ తెలిపారు.