Asianet News TeluguAsianet News Telugu

పోలీస్‌ కొలువులకు దరఖాస్తు గడువు పొడిగించేది లేదు : టీఎస్ ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ శ్రీనివాసరావు

పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పొడిగించేది లేదని, గడువులోనా అర్హులైనవారు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. 

No extension of application deadline for police jobs: TSLPRB Chairman Srinivasa Rao
Author
Hyderabad, First Published May 14, 2022, 11:15 AM IST

హైదరాబాద్ : police jobsల కోసం application చేసుకునే గడువును పొడిగించబోమని పోలీస్‌ నియామక మండలి బోర్డు (TSLPRB) చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ నెల 20 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. చివరి రోజుల్లో సర్వర్‌ డౌన్‌ అయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల వీలైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. 

మరోవైపు, పోలీస్‌ పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. గత 11 రోజుల్లో 2.50 లక్షల మంది అభ్యర్థులు 4.50 లక్షల దరఖాస్తులు దాఖలు చేశారు. ఇందులో లక్ష వరకు మహిళా అభ్యర్థులు ఉన్నారు.

కాగా, మే 4న రాష్ట్రంలో Police ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ సూచించింది. ఈ మేరకు ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే సమయంలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసినట్టుగానే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ప్రాథమిక వివరాలతో TSLPRB వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక వివరాలతో తొలుత ప్రాథమిక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ లేదా ధరఖాస్తు చేసుకొనే సమయంలో అభ్యర్ధులు నమోదు చేసిన డేటాను సవరించుకొనే వీలు లేదు. ఒక్కసారి దరఖాస్తు లేదా రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో తప్పుడు సమాచారం నమోదు చేస్తే ఈ సమాచారాన్ని అప్ డేట్ చేసే వీలు లేదు. తప్పుడు వివరాలు నమోదు చేస్తే సంబంధిత అభ్యర్థి దరఖాస్తును తిరస్కరిస్తారు. 

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం పోటీపడే ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు కూడా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా సరే ఇతర రాష్ట్రాలకు చెందిన  అభ్యర్ధులను OC లుగానే పరిగణించనున్నారు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు 5 శాతం రిజర్వేషన్ మాత్రమే వర్తించనుంది. ఈ నెల 2వ తేదీ నుంచి పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మొదటి రోజే 15 వేల మంది దరఖాస్తు చేసుకొన్నారు. 

2018లో పోలీస్ ఉద్యోగాల కోసం ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఒకే అభ్యర్ధి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ తో పాటు ఏఆర్, సివిల్ తదితర విభాగాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే ఫోన్ నెంబర్ తో ఈ దరఖాస్తు చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios