ఇక నుండి గెలంగాణలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాల నియమాకాలు ఉండవని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు.
హైదరాబాద్: Telangana రాష్ట్రంలో ఇక నుండి Contract పద్దతిలో ఉద్యోగాల నియామకాలు ఉండవని సీఎం KCR ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని తేల్చి చెప్పారు.
ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత కూడా పలు దఫాలు కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాన్ని కేసీఆర్ తప్పు బట్టారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాల నియామకాలు చేయబోమని కూడా ప్రకటించారు. అయితే రాష్ట్రంలో 91,142 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
అయితే ఇందులో సుమారు 11 వేల మంది కాంట్రాక్టు Employees ఆయా రంగాల్లో విధులు నిర్వహిస్తున్నారని సీఎం గుర్తు చేశారు. అయితే కోర్టు ఆయా విభాగాల్లో కాంట్రాక్టు విభాగాల్లో పనిచేస్తున్న వారిని క్రమబద్దీకరణ చేయాలని ఆదేశించిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ 11 వేల మంది ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ప్రకటించారు.ఇక భవిష్యత్తులో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాల నియమాకాలు చేపట్టబోమని కేసీఆర్ తేల్చి చెప్పారు.
Permanant ఉద్యోగుల కంటే కాంట్రాక్టు ఉద్యోగులే ఎక్కువ పని చేస్తారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు తక్కువ ఇవ్వడంతో పాటు చాకిరీ ఎక్కువ చేయిస్తారని కేసీఆర్ చెప్పారు. కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాల నియామకాలు చేపట్టబోమని కేసీఆర్ తేల్చి చెప్పారు.
