నిజామాబాద్ లో మంచినీళ్లనుకొని యాసిడ్ తాగి ఇద్దరికి అస్వస్థత: ఆసుపత్రిలో చికిత్స
మంచినీళ్లు అనుకొని పొరపాటున యాసిడ్ తాగిన ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది. బట్టల షాపులో పెళ్లి దుస్తులు కొనుగోలు చేసే సమయంలో మంచినీళ్లనుకొని యాసిడ్ తాగాడు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
నిజామాబాద్: పొరపాటున మంచినీళ్లనుకొని Acid తాగిన ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Nizambad జిల్లా కేంద్రంలోని ఓ Cloth shop షాపులో షాపింగ్ కు Vijay kumar వచ్చాడు. విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు పెళ్లి బట్టలు కొనుగోలు చేస్తున్నారు.ఈ సమయంలో మంచినీళ్లు కావాలని విజయ్ కుమార్ అడిగాడు. అయితే మంచినీళ్లు అనుకొని బట్టల షాపులో పనిచేసే వ్యక్తి యాసిడ్ బాటిల్ ను ఇచ్చాడు.యాసిడ బాటిల్ కూడా తెలుపు రంగులో ఉంది. దీంతో యాసిడ్ బాటిల్ ను Drinking బాటిల్ గా పొరపాటు పడిన బట్టల షాపులో పనిచేసే వ్యక్తి విజయ్ కుమార్ కు ఇచ్చాడు.
విజయ్ కుమార్ తో పాటు అతని పక్కనే ఉన్న వ్యక్తి కూడా ఈ బాటిల్ లో ఉన్న యాసిడ్ తాగాడు. దీంతో వీరిద్దరూ కూడా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్ Hospital కి తరలించి చికిత్స అందించారు. అయితే మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు విజయ్ కుమార్ ను హైద్రాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. విజయ్ కుమార్ ది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహ్మద్ నగర్ గ్రామంగా పోలీసులు చెబుతున్నారు.