శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ  రైతులు బుధవారం నాడు ఎస్ఆర్ఎస్‌‌పీ  ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.  ఎస్ఈ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం నాడు ఎస్ఆర్ఎస్‌‌పీ ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎస్ఈ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు.దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతేకాదు రాస్తారోకోకు దిగడంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఎస్ఆర్ఎస్‌‌పీ ఎస్ఈ కార్యాలయం ఎదుట రైతులు బుధవారం నాడు ఆందోళన నిర్వహించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకొన్నారు.

జిల్లాలోని 24 గ్రామాలకు చెందిన రైతులు ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు ఆందోళనలో పాల్గొన్నారు.

సాగు నీటిని విడుదల చేసి తమను రక్షించాలని కోరారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా రైతులను పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. 

కాకతీయ కాలువకు, లక్ష్మీ కాలువకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయమేర్పడింది.సుమారు ఐదు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్థంబించిపోయింది.