MLA Jeevan Reddy: అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాట్‌టాపిక్‌గా మారారు. తనదైన ప్రత్యేకత వార్తల్లో నిలిచారు. అంబేడ్కర్ గారి 131వ జయంతి వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి .. తన నియోజకవర్గం లోని మాక్లుర్ మండలం మాణిక్ బాండర్ గ్రామంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా.. ఆ గ్రామ పంచాయతీ లో మూపై ఏండ్లుగా సపాయి కార్మికురాలు గా సేవలందించిన దుర్పతి(70) అనే కార్మికురాలి కాళ్ళను పాలతో కడిగి.. ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన ప్రత్యేకత చాటుకున్నారు.
MLA Jeevan Reddy: ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి.. తెలంగాణ ప్రజానీకానికి ప్రత్యేక పరిచయం అవసరం లేని వ్యక్తి. నిత్యం టీవీ చర్చల్లో, ప్రెస్ మీట్ ల్లో టీఆర్ఎస్ విధానాలను గొంతెత్తి ప్రకటించే నాయకుడు. టీఆర్ఎస్ ను గానీ, సీఎం కేసీఆర్‌ను ఒక్కమాటంటే.. అగ్గి మీద గుగ్గిలంలా.. ప్రతిపక్షాలపై ఒంటికాలిపై లేస్తారు. ఎదుటి వ్యక్తి ఎవరైనా.. తన పదునైన విమర్శలతో చీల్చి చందాడుతాడు. ఇలా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తాజాగా.. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చేసిన పనితో రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. అందరి దృష్టిని ఆకర్షించారు.
భారతరత్న డాక్టర్ అంబేడ్కర్ 131వ జయంతి వేడుకల సందర్భంగా జీవన్ రెడ్డి తన నియోజక వర్గంలో దళిత వర్గానికి చెందిన ఓ తల్లి పాదాలను పాలతో కడిగి పాదాభివందనం చేశారు. మాక్లుర్ మండలం మాణిక్ బాండర్ గ్రామంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నరు. ఈ సందర్భంగా ఆయన అక్కడ గ్రామపంచాయతీలో గత 30 ఏండ్లుగా సపాయి కార్మికురాలు గా సేవలందిస్తున్న 70సంవత్సరాల దళిత అమ్మ దుర్పతి కాళ్ళను పాలతో కడిగారు. ఆమె పాదాలకు నమస్కరించారు. అనంతరం ఆమెను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. తన చర్యతో కులాలకు అతీతంగా అందరూ కలిసి ఉంటేనే అంబేద్కర్ కలలుగన్న అసమానతలు లేని నవభారత నిర్మాణం సాధ్యమని జీవన్ రెడ్డి చాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ది సాధిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. మొన్నటి వరకు ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉన్న వ్యక్తే ఇప్పుడు అదే ట్రాక్టర్ కి ఓనర్ చేసిన ఘనత కేసీఆర్ దన్నారు. ఎన్నో ఏళ్లుగా పేదరికంలో మగ్గిపోతున్న దళితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్ని నిధులివ్వడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
అంటరానితనం అనే దురాచారం అభివృద్ధి కి అడ్డుగోడ నిలుస్తుందనీ, తోటి మనిషిని మనిషిగా చూడలేని ఈ సమాజం.. అనాగరిక ఆచారం పల్లెల ప్రగతికి అవరోధమని, ఇలాంటి అవలక్షణాల నుంచి బయటపడితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. కానీ ప్రజలంతా కులాల పేరుతో, మతాల పేరుతో కొట్టుకుంటే ఎంతచేసినా లాభం ఉండదనీ, గ్రామాలన్నీ ఏకమై అంటరానితనం అనే భూతాన్ని తరిమి కొట్టాలని.. అదే అంబేద్కర్ కు మనం అర్పించే నిజమైన నివాళి అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
