Asianet News TeluguAsianet News Telugu

నిజామాబాద్ లో మిస్సై యూపీలో... సోషల్ మీడియా ప్రియుడి చేతిలో వివాహిత దారుణ హత్య

సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడి కోసం కట్టుకున్న భర్త, కన్నబిడ్డలను వదిలి నిజామాబాద్ నుండి ఉత్తర ప్రదేశ్ కు వెళ్లిన వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. ప్రేమ పేరిట నమ్మించిన ప్రియుడే అవసరం తీరాక హత్యచేసాడు. 

Nizamabad woman brutal murder in Uttar Pradesh
Author
First Published Nov 13, 2022, 9:00 AM IST

నిజామాబాద్ : సోషల్ మీడియా ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను, కన్నబిడ్డలను కాదని ఇళ్లువిడిచి వెళ్లిన వివాహిత చివరకు దారుణ హత్యకు గురయింది. ఫేస్ బుక్ ప్రియున్ని కలిసేందుకు నిజామాబాద్ నుండి ఉత్తర ప్రదేశ్ వెళ్లిన వివాహిత నమ్మివచ్చిన వాడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇలా బాన్సువాడలో అదృశ్యమైన మహిళ ఎక్కడో యూపీలో శవంగా తేలింది.   

వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో ముఖీద్-ఉస్మాభేగం దంపతులు నివాసముండేవారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. అయితే పెళ్లయిన 12ఏళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తి కొంతకాలం విడిపోగా ఇటీవలే మళ్లీ కలిసారు. ఇలా భర్తలో విడిపోయి ఒంటరిగా వుంటున్న సమయంలోనే ఉస్మాకు సోషల్ మీడియాలో ఉత్తరప్రదేశ్ కు చెందిన హెహజాద్ తో పరిచయం ఏర్పడింది. ఇదికాస్తా ప్రేమకు దారితీసింది. షెహజాద్ మాయమాటలను నమ్మిన ఆమె అతడితో జీవితాన్ని పంచుకోవాలని భావించి భర్తనే కాదు నవమాసాలు మోసి కనిపెంచిన పిల్లలను సైతం వదిలేసేందుకు సిద్దమయ్యింది. 

సోషల్ మీడియా ప్రియున్ని కలిసేందుకు ఈనెల (నవంబర్) 6న ఉస్మాభేగం ఇంట్లోంచి వెళ్లిపోయింది. భార్య కనిపించకపోవడంతో ముఖీద్ అత్తవారింట్లో, బంధువులను ఆరాతీయగా ఎక్కడ ఆఛూకీ లభించలేదు. దీంతో అతడు పొలీసులను ఆశ్రయించగా మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. 

Read More సూర్యాపేట : అయ్యప్ప పూజకు వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

అయితే బాన్సువాడలో మాయమైన ఉస్మాభేగం సోషల్ మీడియా ప్రియున్ని కలిసేందుకు ఉత్తర ప్రదేశ్ అమ్రోహా జిల్లా గజరౌలా వెళ్లింది. స్థానికంగా ఓ సెక్యూరిటీ కంపనీలో పనిచేసే ప్రియుడు షహజాద్ ను కలిసింది. సెక్యూరిటీ కంపనీకి చెందిన తాళంచెవి షహజాద్ వద్దే వుండటంతో అక్కడికి ఉస్మాను తీసుకెళ్లాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఉస్మా కోరగా అందుకు షహజాద్ నిరాకరించాడు. దీంతో ఇద్దరిమధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. కోపంతో రగిలిపోయిన షహజాద్ చున్నీతో ఉస్మాను కట్టిపడేసి చేతికందిన ఇటుకతో తలపై బాదాడు. తీవ్ర రక్తస్రావమై అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఆమె కొద్దిసేపటికి ప్రాణాలు కోల్పోయింది.  

ఉస్మా మృతిచెందినట్లు గుర్తించిన షహజాద్ శవాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు.  రెండుమూడు రోజుల తర్వాత మృతదేహాన్ని గుర్తించిన కంపనీ సిబ్బంది గజరౌలా పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ మృతదేహం వద్ద లభించిన ఆధారాలతో ఆమెది నిజామాబాద్ జిల్లాగా గుర్తించారు. దీంతో ఇక్కడి పోలీసులకు సమాచారమివ్వగా ఇక్కడ మిస్సయిన ఉస్మాగా గుర్తించారు. ఆమె కుటుంబసభ్యులకు సమాచారమివ్వగా మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు యూపీ వెళ్లారు. 

హాయిగా సాగుతున్న జీవితంలో చిచ్చుపెట్టిన సోషల్ మీడియా స్నేహం చివరకు వివాహిత ప్రాణాలు తీసింది. ఇలాంటి ఘటనలు దృష్టిలో వుంచుకునే సోషల్ మీడియా స్నేహాలను నమ్మి మోసపోవద్దని చెబుతుంటామని పోలీసులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios