ప్రస్తుతం దేశం వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్‌లో స్థానిక సంస్థల కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. 

ఉప పోరులో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు స్పష్టంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, అభ్యర్ధి ఎంపిక కోసం గ్యాప్ తీసుకుంది. చివరికి కేసీఆర్ కుమార్తె కవిత రంగంలోకి దిగడంతో బీజేపీ, కాంగ్రెస్ సైతం పోటీకి సిద్ధమయ్యాయి. కాషాయ దళం తరపున పి. లక్ష్మీనారాయణ నామినేషన్ వేశారు.

Also Readసర్వైవ్ లెన్స్ స్టేట్ గా తెలంగాణ: తాజాగా మరో మూడు కరోనా కేసులు

ఇదే సమయంలో కరోనా వైరస్ రాష్ట్రంలో వేగంగా వ్యాపిస్తోంది. గుంపులు గుంపులుగా జనాలు తిరగేందుకు వీలు లేకుండా ప్రభుత్వం లాక్ డౌన్‌ను అమలు చేస్తోంది. ఎన్నికలో గెలుపొందేందుకు గాను మూడు పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరదీసినట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పోరేటర్లను రిసార్ట్స్‌లకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరు ముగ్గురు కూడా విదేశాల నుంచి వచ్చారు. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

ఈ ముగ్గురు లండన్, జర్మనీ, సౌదీల నుంచి వచ్చారు. లండన్ నుంచి వచ్చిన హైదరాబాదు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఇతను హైదరాబాదులోని కోకాపేటకు చెందినవాడు.

Also Read:తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు: 36కు చేరిన సంఖ్య

జర్మనీ నుంచి వచ్చిన 39 ఏళ్ల వయస్సు గల మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. సౌదీ నుంచి వచ్ిచన 61 ఏళ్ల వయస్సు గల మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరో 9 కరోనా ఆనుమానిత కేసులను కూడా అధికారులు గుర్తించారు. వీరందరూ ఆస్పత్రుల్లో ఉన్నారు. సోమవారంనాడు 33 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మూడు కేసులు నిర్ధారణ కావడంతో ఆ సంఖ్య 36కు చేరింది. ఇందులో మూడు కాంటాక్ట్ కేసులున్నాయి.