Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్: 12న ఫలితాలు

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ముగిసింది. మొత్తం 100 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 824 మంది ప్రజా ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 12న ఫలితాలు వెలువడనున్నాయి. 

Nizamabad MLC byelection polling completed
Author
Nizamabad, First Published Oct 9, 2020, 5:12 PM IST

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ముగిసింది. మొత్తం 100 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 824 మంది ప్రజా ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 12న ఫలితాలు వెలువడనున్నాయి. 

నిజామాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ఈ రోజు ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగింది. పోలింగ్ కు సంబంధించి 50 కేంద్రాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వి.సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పోతనకర్‌ లక్ష్మీనారాయణలు బరిలో ఉన్నారు.

నిజామాబాద్ జడ్పీ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తొలి ఓటు వేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్, రాజేశ్వర్ తదితర 28 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

బాన్సువాడలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్‌దేనని, వార్ వన్ సైడే ఉందని, కవిత గెలుపు ఖాయమని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios