నిజామాబాద్ లో అత్యాచార బాధిత బాలికల్లో 8 మంది గర్భిణులుగా తేలింది. బుధవారం సఖి కేంద్రంలో ఉన్న బాలికలకు వైద్యపరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

నిజామాబాద్ : వారంతా అత్యాచార బాధిత బాలికలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారు. ఆయా ఘటనలో కామాంధుల బారినపడిన ఆ బాలికలను నిజామాబాద్ నగరంలో సఖి కేంద్రంలో ఉంచారు. బుధవారం సాయంత్రం వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా ఆ బాలికల్లో ఎనిమిది మంది గర్భం దాల్చినట్లు వెల్లడైంది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి బాధిత బాలికలను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. వారి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. ఇకపై బాధిత బాలికలను సర్వీస్ సెంటర్ లోనే ఉంచి వైద్య చికిత్స అందించాలని నిర్ణయించారు. 

ఇదిలా ఉండగా, బాలికపై Molestation జరిపిన కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు వెయ్యి రూపాయల fine కూడా చెల్లించాలని court ప్రత్యేక న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష అనుభవించాలి అని న్యాయమూర్తి ఆదేశించారు. ఫోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాజీ జంక్షన్, కూరగాయల మార్కెట్ ప్రాంతానికి చెందిన చాపల శ్రీనివాసరావు (32) రాడ్ బెండర్ గా పని చేసేవాడు. బుచ్చి రాజుపాలెం, పైడితల్లమ్మ ఆలయం ప్రాంతానికి చెందిన బాలిక (6) 2016 జూలై 19న పైడితల్లమ్మ ఆలయం వద్ద ఒంటరిగా ఆడుకుంటుంది.

 శ్రీనివాసరావు బాలిక నోరు మూసి ఆలయం వెనుక భాగంలో ఉన్న పాడు పడిన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని తన తండ్రికి సంజ్ఞలతో తెలిపింది. తండ్రి ఫిర్యాదు మేరకు ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడు శ్రీనివాసరావు న్యాయస్థానంలో హాజరుపరిచారు. పరిశీలించిన న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఫిబ్రవరి 4న మైసూరులో చోటు చేసుకుంది. ఆపదలో ఉన్న వారిని రక్షించాల్సిన పోలీస్ అధికారి అయి ఉండి mental condition సరిగా లేని యువతిని చెరబట్టిన కామాంధుడికి court కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం వద్ద యువతిపై ఏఎస్ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల imprisonmentతో పాటు.. లక్ష రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు జడ్జి హెచ్.ఎస్.మల్లికార్జునస్వామి తీర్పు వెలువరించారు.