Asianet News TeluguAsianet News Telugu

అసద్‌కు మహేశ్వర్ రెడ్డి కౌంటర్: నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటా

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్  ఓవైసీ చేసిన వ్యాఖ్యలను నిర్మల్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉన్న మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అసద్ తాను చేసిన ఆరోపణలను  నిరూపిస్తే  తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకొంటానని ఆయన సవాల్ విసిరారు.
 

nirmal congress candidate maheshwar reddy reacts on asaddin owaisi comments
Author
Nirmal, First Published Nov 20, 2018, 1:28 PM IST


నిర్మల్: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్  ఓవైసీ చేసిన వ్యాఖ్యలను నిర్మల్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉన్న మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అసద్ తాను చేసిన ఆరోపణలను  నిరూపిస్తే  తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకొంటానని ఆయన సవాల్ విసిరారు.

రాజకీయాల్లో తాను ఇంత దిగజారుడుతనాన్ని చూడలేదన్నారు.నిర్మల్‌ సభలో తాను పాల్గొనకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ రూ. 25 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చిందని ఎంఐఎం అధినేత  అసదుద్దీన్ ఓవైసీ చేసిన సంచలన కామెంట్స్‌ చేశారు.  ఈ వ్యాఖ్యలపై మహేశ్వర్ రెడ్డి మంగళవారం నాడు స్పందించారు.

అసదుద్దీన్‌ను తాను వార్తల్లో మాత్రమే చూశానని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఏనాడూ కూడ అసద్ ను ప్రత్యక్షంగా కలుసుకోలేదని ఆయన చెప్పారు.అసద్  చేసిన ఆరోపణలను  నిరూపిస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకొంటానని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు.

తాను నామినేషన్ దాఖలు చేసే సమయంలో  సుమారు 60వేల మందితో  ర్యాలీ నిర్వహించడంతో  టీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డికి ఎటూ పాలుపోలేదన్నారు. దీంతో  అసదుద్దీన్ ను పిలిపించారన్నారు. అసద్ కు కనీసం స్వాగతం పలికేందుకు స్థానికంగా ఎవరూ లేకపోవడంతో ఇతర నియోజకవర్గాల నుండి  కార్యకర్తలను పిలిపించారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

ఈ మేరకు మంగళవారం నాడు ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. అసద్ కు రూ. 25 లక్షలు ఇస్తానని తాను చెప్పినట్టుగా ఫోన్ రికార్డులు ఉన్నాయని చెబుతున్నాడని...  ఆ రికార్డులను బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలను తనపై ఓవైసీ చేస్తున్నారని ఆయన చెప్పారు.

ఓవైసీ తనపై ఆరోపణలు చేసి ఓవైసీ తన స్థాయిని దిగజార్చుకొన్నారని చెప్పారు. గత ఎన్నికల సమయంలో ఓవైసీ వచ్చి బీఎస్పీకి ఓటు వేయాలని కోరాడని ఆయన గుర్తు చేశారు. కానీ, ముథోల్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

రూ.25 లక్షల ఆఫర్: కాంగ్రెస్‌పై అసదుద్దీన్ సంచలన ఆరోపణలు

 


 

Follow Us:
Download App:
  • android
  • ios