లైంగిక వేధింపుల కేసులో సైంటిస్ట్ భాస్కరాచారి అరెస్ట్

NIN Scientist accused of sexual harassment arrested in Hyderabad
Highlights

ఎన్ఐఎన్ లో పనిచేసి విద్యార్థినిని లైంగికంగా వేధించిన సైంటిస్ట్

లాలాగూడలోని జాతీయ పోషకాహార సంస్థలో సైంటిస్ట్ గా పనిచేస్తున్న భాస్కరాచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంస్థలో పనిచేసే ఓ విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాస్కరాచారి కింద జూనియర్ సైంటిస్ట్ గా పనిచేస్తున్న యువతిని అతడు లైంగికంగా వేధించడంతో ఆమె ఉన్నతాధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఉత్తరాదిలోని మేఘాలయ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని జాతీయ పోషకాహార సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అయితే ఈమెపై అదే సంస్థలో సీనియర్ సైంటిస్ట్ గా పనిచేస్తున్న భాస్కరాచారి కన్ను పడింది. దీంతో ఆమెను తరచూ లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె సంస్థ ఉన్నతాధికారులకు అతడిపై ఫిర్యాదు చేసింది. అతడిపై గుట్టుగా విచారణ జరిపిన ఎన్ఐఎన్ ఉన్నతాధికారులు, అతడి విద్యార్థినిని వేధించినట్లు నిర్ధారించుకుని అతడిపై శాఖా పరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశారు.

ఈ ఘటనతో భయపడిపోయిన విద్యార్థి తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయింది. అయితే ఆమెకు ధైర్యం చెప్పిన పోలీసులు వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సూచించారు. దీంతో ఆమె ఉస్మానియా పోలీస్ స్టేషన్ లో భాస్కరాచారి పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.అతడిపై ఎస్సీ,ఎస్టీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
 

loader