హైద్రాబాద్ నగరంలో దారుణం చోటు  చేసుకుంది.  మందలించాడని తండ్రిని హత్య చేసింది కూతురు.  ఈ ఘటనకు  పాల్పడిన నిందితురాలిని పోలీసులు  అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్ అంబర్ పేటలో దారుణం: తండ్రి గొంతు కోసి చంపిన కూతురుహైదరాబాద్: నగరంలోని అంబర్ పేటలో ఆదివారంనాడు దారుణం చోటు చేసుకుంది. మందలించాడని తండ్రిని గొంతుకోసి చంపింది కూతురు. ఈ ఘటనకు పాల్పడిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్ అంబర్ పేటలో జగదీష్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అయితే కూతురు నిఖితను తండ్రి జగదీష్ మందలించాడు. దీంతో తండ్రిపై కూతురు నిఖిత కోపం పెంచుకుంది. నిఖిత తన తండ్రి జగదీష్ గొంతు కోసింది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులుఅతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జగదీష్ మృతి చెందాడు. 

జగదీష్ హత్యకు మరో కారణం కూడ ప్రచారంలో ఉంది. ప్రతి రోజూ మద్యం తాగి వస్తున్నాడని కూతురు నిఖిత తండ్రిపై గ్లాస్ తో దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన జగదీష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని చెబుతున్నారు. అయితే జగదీష్ మృతిపై పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు తేలనున్నాయి.