Asianet News TeluguAsianet News Telugu

నిన్న సృజన.. నేడు లక్ష్మి.. మహబూబ్ నగర్ లో విషాదం.. పెళ్లైన కాసేపటికే నవ వధువు ఆత్మహత్య..

పెళ్లైన కాసేపటికే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ లో విషాదం నింపింది. పేను విరుగుడు మందు తాగి ఆమె మృతి చెందింది. 

newly wedded bride commits suicide in mahabubnagar
Author
Hyderabad, First Published May 14, 2022, 7:54 AM IST

మహబూబ్ నగర్ : వైజాగ్ మధురవాడ newly wedded bride సృజన ఘటన మరువకముందే మరో విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తనకు ఇష్టంలేని marriage చేశారని మనస్తాపంతో ఓ నవవధువు వివాహం జరిగిన కాసేపటికే suicide చేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పాత తోట ప్రాంతానికి చెందిన లక్ష్మికి అనంతపూర్ జిల్లాకు చెందిన మల్లికార్జున్ తో గురువారం వివాహం జరిగింది. పెళ్లి సందర్బంగా ఎంతో హుషారుగా కనిపించిన నవ వధువు లక్ష్మి.. ఒక్కసారిగా పెళ్లింట విషాదాన్ని నింపింది. వివాహమైన కాసేపటికే నవ వధువు.. బాత్రూంలోకి వెళ్లి పేను విరుగుడుకు వేసే మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది..  

ఆ తరువాత ఆమె ఎంతకీ బాత్రూం నుంచి బైటికి రాకపోవడంతో లక్ష్మి కుటుం సభ్యులు వెళ్లి చూడగా ఆమె స్పృహలేకుండా కిందపడిపోయి కనిపించింది. వెంటనే ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించగా, లక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, లక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉండగా, విశాఖలో ఏప్రిల్ 11 సాయంత్రం పెళ్లి పీటలపైనే  నవవధువు మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. నాగోతు శివాజీ, సృజనలకు పెద్దలు పెళ్లి నిర్ణయించారు. మే 11వ తేదీ.. బుధవారం రాత్రి 7 గంటలకు వివాహం జరగాల్సి వుంది. మధురవాడలో పెళ్లి పందిరిలో వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు. ప్రక్రియ ఈ సమయంలో వధువు ఒక్కసారిగా పెళ్లి పీటలపై కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకువెడితే మృతి చెందినట్లు నిర్థారించారు. 

అంతకుముందు బుధవారం ఉదయం పెళ్లి కుమార్తె సృజనకు కడుపునొప్పి రావడంతో ఆమెను విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. సృజనను పరిశీలించిన డాక్టర్లు .. టాబ్లెట్లు, ఫ్లూయిడ్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. అప్పుడు కూడా సృజన ఆరోగ్యంగానే వుందని.. కాసేపట్లో మాంగళ్య ధారణ జరగాల్సి వుండగా ఆమె అస్వస్థతకు గురైంది. జీలకర్ర , బెల్లం పెడుతుండగా సృజన పెళ్లి పీటలపైనే స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సృజన కన్నుమూసింది. డాక్టర్లు వెల్లడించిన అంశాలపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 

దీనిపై మృతురాలు సృజన సోదరుడు విజయ్ మీడియాతో మాట్లాడారు. తన సోదరి ఆత్మహత్య చేసుకుందనే వార్తలను ఆయన ఖండించారు. ఆమె ఇష్ట ప్రకారమే పెళ్లి కుదిర్చామని.. అయితే వివాహ సమయంలో పీరియడ్స్ సమస్య రాకుండా వుండేందుకు సృజన కొన్ని మాత్రలు వేసుకుందని విజయ్ చెప్పాడు. వాటి కారణంగానే రెండు రోజులు ఇబ్బంది పడిందని.. అంతకుమించి ఆమె మరణానికి కారణాలు తమకు తెలియవని తెలిపారు. సృజనది ఆత్మహత్య కాదని విజయ్ స్పష్టం చేశారు. 

కాగా, సృజన హ్యాండ్ బ్యాగ్‌లో గన్నేరు పప్పు ఉండటంతో ఆత్మహత్య చేసుకుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సృజనను చికిత్స నిమిత్తం మొదట చేర్పించిన ఆసుపత్రి వైద్యులు.. ఆమె గుర్తు తెలియని విషం తీసుకోవడం వల్ల చనిపోయిందని నివేదిక ఇచ్చారు. దీంతో పోస్ట్‌మార్టంలో ఏం తేలబోతుందనే దానిపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సృజన మొబైల్ కోసం పోలీసులు తల్లిదండ్రులను కోరారు. అయితే Mobileను ఆలస్యంగా పోలీసులకు సృజన కుటుంబ సభ్యులు ఇచ్చినట్టుగా సమాచారం. అందులో చాటింగ్స్, పోన్ కాల్స్ సమాచారం డిలీట్ చేసి ఉంది. ఈ ఫోన్‌లో మిస్డ్ కాల్స్ లిస్ట్ మాత్రమే ఉండడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సృజన ఫోన్లో ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు టెక్ నిపుణులను సంప్రదించారు పోలీసులు. 

Follow Us:
Download App:
  • android
  • ios