భర్త సెకండ్ షో సినిమాకు తీసుకువెళ్లలేదని భార్య ఆత్మహత్య.. ప్రేమ వివాహం చేసుకుని మూడునెలలు కూడా గడవకముందే...

క్షణికావేశం వారి ప్రేమను పరీక్షించింది. సంవత్సరాలుగా ప్రేమించుకుని.. పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకుని.. సెకండ్ షో సినిమాకు తీసుకువెళ్లలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. 

Newly wed woman ends life as husband refuses to go second show movie Hyderabad

హైదరాబాద్ : వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కలిసి జీవించాలనుకున్నారు. జీవితాంతం కలిసి నడుద్దామని బాసలు చేసుకున్నారు. ఎంతో ఆశపడి ఇంటో పెద్దలను ఎదురించి మరీ గుళ్లో Marriage చేసుకున్నారు. కానీ మూడు నెలలు కూడా నిండక ముందే వారి కాపురంలో విషాదం నెలకొంది. second show movie వారి కాపురంలో చిచ్చు రేపింది. మనస్తాపానికి గురైన భార్య గురువారం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలో చోటు చేసుకుంది. శంకర్ పల్లి ఎస్ ఐ సంతోష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెం గ్రామానికి చెందిన  రాజు (22), స్వాతి (20) ప్రేమించుకున్నారు. 

ఈ ఫిబ్రవరిలో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. తరువాత ఇరువైపులా పెద్దలను ఒప్పించారు. రెండు నెలల కిందట శంకర్ పల్లి పట్టణంలోని భవానీనగర్ లో అద్దె గది తీసుకుని కాపురం పెట్టారు. రాజు హోటల్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి సెకండ్ షో సినిమాకు తీసుకెళ్లాలని భార్య కోరింది. దీనికి రాజు ఒప్పుకోలేదు. గురువారం తీసుకెడతానని చెప్పాడు. ఈ విషయంలో చిన్నపాటి గొడవ జరగ్గా.. మనస్తాపానికి గురైన స్వాతి గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. సమాచారం అందుకుని వచ్చిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్లో మంగళవారం దారుణం జరిగింది. uttarpradeshలోని ఫతేపూర్ లో బాలికపై అత్యాచారానికి సంబంధించిన రేప్ కేసులో మంగళవారం సాయంత్రం  నిందితుడైన యువకుడిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా, అంతలోనే ఆ బాలిక విషం తాగి మరణించడంతో విషాదం నెలకొంది. ఆమె మీద అత్యాచారం జరిగిన ఒక రోజు తర్వాత బాలిక suicide చేసుకుంది. 15 ఏళ్ల దళిత బాలికపై ఆమె గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెడితే.. యుపిలోని ఫతేపూర్ జిల్లాలోని చాంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫతేపూర్ పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, 15 ఏళ్ల దళిత బాలిక మంగళవారం సాయంత్రం తన గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన యువకుడు.. ఆమెను చూశాడు. ఆమె వెంటపడి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అయితే, బైటికి వెళ్లిన బాలిక రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమె కోసం వెతకగా అడవిలో స్పృహలేని స్థితిలో  కనిపించిందని ఎస్పీ తెలిపారు. కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్‌ వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆ బాలిక మనస్తాపంతో బుధవారం తెల్లవారుజామున విషం తాగింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు తెలిపారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios