కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. గుర్తు తెలియని వాహనం డీకొని నవదంపతులు మృత్యువాతపడ్డారు. సదాశివనగర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం పాలయ్యారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సదాశివనగర్ మండలం మొడేగాం గ్రామానికి చెందిన బట్టు ప్రభాకర్, టాకూర్ మహిమలు ద్విచక్ర వాహనంపై కామారెడ్డి వైపు నుండి వస్తుండగా జూనియర్ కళాశాల వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో మహిమ సంఘటనా స్థలంలో మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ప్రభాకర్‌ను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు.

వీరు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుని తిరిగి స్వస్థలానికి వస్తుండగా సంఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.