హైదరాబాద్ సరూర్‌నగర్‌లో నవదంపతులపై అమ్మాయి తరపు బంధువులు దాడి చేశారు. యువకుడిని ఐరన్ రాడ్‌తో కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సరూర్ నగర్ చెరువు కట్ట వద్ద ఈ ఘటన జరిగింది. 

హైదరాబాద్ (hyderabad) సరూర్ నగర్‌లో (saroor nagar) దారుణం జరిగింది. బైక్‌పై వెళ్తున్న దంపతులపై దాడి చేశారు అమ్మాయి తరపు బంధువులు. అబ్బాయిపై ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొన్ని రోజుల క్రితమే ఈ జంట ప్రేమ వివాహం చేసుకుంది. సరూర్‌నగర్‌లోని చెరువు కట్ట దగ్గర వీరిపై దాడి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.