హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. వనస్థలిపురం నవవధువు ఆత్మహత్య చేసుకుంది. స్థానిక సుష్మసాయినగర్‌కు చెందిన నివేదిత ఆదివారం తెల్లవారుజామున భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. వనస్థలిపురం నవవధువు ఆత్మహత్య చేసుకుంది. స్థానిక సుష్మసాయినగర్‌కు చెందిన నివేదిత ఆదివారం తెల్లవారుజామున భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

6 నెలల క్రితం రఘురామ్‌ప్రసాద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో ఆమెకు వివాహం జరిగింది. వివాహం జరిగిన నాటి నుంచి భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించడం వల్లే నివేదిక బలవన్మరణానికి పాల్పడిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నివేదిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, రఘురామ్‌ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు.