ఇటీవల కీర్తి అనే యువతి ప్రియుడి ప్రోద్భలంతా కన్న తల్లిని అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా...  తల్లిని హత్య చేసిన కేసులో కీర్తి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కాగా.. గురువారం ఆమెను రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఆమె రిమాండ్ ను మరో 14 రోజులపాటు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 

ఈ నెల ఒకటో తేదీన హయత్‌నగర్‌ పోలీసులు కీర్తిని జైలుకు తరలించిన విషయం తెలిసిందే. రిమాండ్‌లో ఉన్న ఆమెను పోలీసులు మరింత విచారించేందుకు ఐదు రోజుల కస్టడీకి కోర్టు ఆనుమతించింది. దీంతో మంగళవారం ఆమెను పోలీసులు కస్టడీలోకి తీసుకొని రిమాండ్‌ గడువు ముగుస్తున్న కారణంగా బుధవారం సాయంత్రం జైలుకు తరలించారు.
 
తిరిగి శుక్రవారం కీర్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని శనివారం జైలుకు తరలించే ఆవకాశం ఉంది. రెండు రోజుల కస్టడీలో తల్లి హత్యకు సంబంధించిన విషయాలు వివరంగా పోలీసులకు చెప్పినట్లు సమాచారం. జైలులో 14 రోజుల రిమాండ్‌ కాలంలో మేనత్త, మామ మాత్రమే కలిసి మాట్లాడారు. తండ్రి ఇప్పటి వరకు జైలుకు వెళ్లి కీర్తిని కలవలేదు. ఆమె జైలులో తోటి ఖైదీలతో కలిసి యోగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

రూ. 10 లక్షల కోసం తన తల్లి రజితను గత నెల 19వ తేదీన రెండో ప్రియుడు శశికుమార్ తో కలిసి కీర్తిరెడ్డి హత్య చేసింది. కీర్తిరెడ్డి తల్లి రజితను హత్య చేస్తేనే తనకు కీర్తిరెడ్డితో పాటు ఆమె ఆస్తి దక్కుతోందని శశికుమార్ ప్లాన్ చేశాడు.ఈ ప్లాన్ లో భాగంగానే బాల్ రెడ్డితో పాటు తనతో కీర్తిరెడ్డి సన్నిహితంగా ఉన్న పోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని శశికుమార్ బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఈ బెదిరింపులతోనే రెండుసార్లు రజితను హత్య చేయాలని కీర్తిరెడ్డి ప్లాన్ చేసింది. మొదటిసారి తల్లికి నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. కానీ, రెండోసారి మాత్రం కీర్తిరెడ్డి ప్లాన్ సక్సెస్ అయింది. తల్లి కళ్లలో కారం కొట్టి ఆమెను ఛాతీపై కూర్చొంది. రెండో ప్రియుడు శశికుమార్ ఆమె గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు.

ఈ వార్తలు కూడా చదవండి

గతంలోనూ తల్లిని చంపేందుకు ప్లాన్, బలవంతంగా కీర్తిని వశపరుచుకున్న శశి

తల్లి రజితను చంపిన కీర్తి: దృశ్యం సినిమాకు రెండో వెర్షన్

ఒకరికి బ్రేకప్, మరొకతనితో లవ్: అమ్మను చంపి దొరికాక ఏడ్చేసిన కీర్తి