కన్ను కొట్టి పడేసిన పిల్ల కేసులో కొత్త ట్విస్ట్

కన్ను కొట్టి పడేసిన పిల్ల కేసులో కొత్త ట్విస్ట్

మలయాళ భాషతోపాటు దేశమంతా సంచలనం రేపిన ప్రియా వారియర్ వీడియోపై హైదరాబాద్ లో వివాదం పుట్టింది. ఈ వీడియోలోని లిరిక్ లో ఒక వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని  హైదరాబాద్ లోని ఫలక్ నుమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలక్ నామా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ కేసు విషయమై ఫలక్ నుమా ఏసీపీ సయ్యద్ ఫయాజ్ మీడియాతో మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త ఆయన భార్య ఖాదీ జ‌బీబీ పై ఓర్ అదర్ లవ్ (మలయాళీ చిత్రం)లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందిందని చెప్పారు. ముఖీద్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఎఫ్ ఐఆర్ నమోదు చేశామన్నారు.

మళయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్, డైరెక్టర్ పై 295 క్లాజ్ ఏ క్రింద కేసు నమోదు చేశామని చెప్పారు. ఆ సాంగ్ మలయాళంలో ఉన్నందున ట్రాన్స్ లేట్ చేసి తదుపరి యాక్షన్‌ తీసుకుంటామన్నారు.

ఈ కేసు ఒక వ్యక్తికి సంబంధించినది కాదని.. ఒక వర్గానికి సంబంధించినదని ఎసిపి చెప్పారు. ఒక వర్గానికి సంబంధించిన కేసు కావడంతో సంబంధిత మత పెద్దలతో మాట్లాడి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై నిర్ణయిస్తామన్నారు.

అలాగే యూట్యూబ్ లో ఉన్న పాట తాలూకు వీడియోను తీసేయాలని చేసిన డిమాండ్ పై ఎసిపి సయ్యద్ ఫయాజ్ మాట్లాడుతూ దీనిపైన సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేస్తామన్నారు. వారి సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page