Asianet News TeluguAsianet News Telugu

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ట్విస్ట్: భారత ఆర్ధిక వ్యవస్థపై చైనా కంపెనీ కుట్ర

హైదరాబాద్‌లో గురువారం పోలీసులు  అరెస్ట్ చేసిన ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ ముఠాకు సంబంధించి కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. చైనాకు చెందిన బీజింగ్ టీ కంపెనీ దీనిని నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

new twist in online betting gang case
Author
Hyderabad, First Published Aug 14, 2020, 9:07 PM IST

హైదరాబాద్‌లో గురువారం పోలీసులు  అరెస్ట్ చేసిన ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ ముఠాకు సంబంధించి కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. చైనాకు చెందిన బీజింగ్ టీ కంపెనీ దీనిని నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

వందల సంఖ్యలో వెబ్‌సైట్స్, యాప్స్ తయారు చేసి  ఈ కంపెనీ బెట్టింగ్ నిర్వహిస్తోంది. భారత్‌లో ఈ ఆపరేటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముగ్గురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కంపెనీ ఇప్పటికే రూ.1,100 కోట్ల పైచిలుకు మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. కొత్త కొత్త పేర్లతో సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లుగా తేలింది.

ఇందుకు గాను వివిధ దేశాల ఐపీ అడ్రస్‌లతో బెట్టింగ్ నిర్వహిస్తోంది... తద్వారా భారతదేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేందుకు సదరు చైనా కంపెనీ కుట్రపన్నినట్లు తెలుస్తోంది. దీంతో కంపెనీ మూలాలను వెతికేందుకు సైబర్ టీమ్ రంగంలోకి దిగింది.

దీనిలో భాగంగా నిర్వహిస్తున్న వెబ్‌సైట్ల సమాచారాన్ని సేకరించింది. అలాగే యాప్స్, వెబ్‌సైట్లను నిషేధించాలని డీవోపీటిని సైబర్ క్రైమ్ విభాగం కోరింది. దీనితో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్‌లకు సమాచారం ఇచ్చింది.

దీనిపై జాయింట్ సీపీ అవినాష్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నామన్నారు. వివిధ రూపాలలో కంపెనీలు డబ్బులు వసూలు చేస్తున్నాయిని సీపీ వెల్లడించారు.

పేటీఎం లాంటి కంపెనీలు నిర్వాహకులకు గేట్‌వేలాగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పేటీఎం సంస్థను కూడా విచారిస్తామని అవినాష్ వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios