విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీ చేస్తుండగా.. రియాద్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 600 గ్రాముల బంగారం, దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 220 గ్రాముల బంగారం పట్టుడింది. దీంతో ఆ ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

ఒకరు బంగారాన్ని కుక్కర్ లో దాచిపెట్టగా.. మరొకరు డ్రిల్లింగ్ మెషిన్ లో దాచి పెట్టడం గమనార్హం. కాగా  వారిపై కేసు నమోదుచేసి.. వారి వద్దనున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.