Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్ డీపీగా భార్యాభర్తల ఫొటో పెట్టుకున్నారా? అయితే డేంజరే.. జాగ్రత్త అంటున్న పోలీసులు..

హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో రోజూ ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఫేస్బుక్,  insta,  ట్విట్టర్  వంటి మాధ్యమాల్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపేవారు.  స్నేహం పేరుతో ఆయా సామాజిక మాధ్యమాల్లో ఇతరులు పెట్టే పోస్టులు ఫోటోలు తీసుకుని మోసగాళ్లు వారి ఖాతాలకు డీపీ లుగాపెట్టుకునేవారు. ఎవరి ఫోటో అయితే డిపిగా పెట్టుకున్నారో వారి స్నేహితులు, బంధువులకు చికిత్స నిమిత్తం డబ్బులు కావాలని సందేశాలు పంపేవారు. 

new scams with whatsapp DPs says hyderabad cyber crime police
Author
Hyderabad, First Published Jan 5, 2022, 6:46 AM IST

నారాయణగూడ :  వాట్సప్ డీపీలుగా పెట్టుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేసి blackmail చేస్తున్న నయా Cyber ​​scams ప్రస్తుతం బాగా ఎక్కువయ్యాయి. దంపతుల చిత్రాలు Morphing చేస్తూ సైబర్ కేటుగాళ్లు బ్లాక్ మెయిల్ చేసి లక్షలు డబ్బు డిమాండ్ చేస్తున్నారు. డీపీలు పెట్టేముందు, పదే పదే మార్చేముందు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ Cybercrime హెచ్చరిస్తోంది. 

ఒక వివాహితుడి వాట్స్అప్ కి  ‘కాల్ గర్ల్స్ కావాలా?’ అనే శీర్షికతో లింక్ వచ్చింది. దాని పై క్లిక్ చేయగానే అతని ఫోన్ నెంబర్ తో వాట్సప్ గ్రూపు తో అనుసంధానం అయింది.  కొద్ది క్షణాల్లోనే నగ్నంగా, అర్థనగ్నంగా ఉన్న అమ్మాయిల చిత్రాలు వచ్చాయి.  ఏ అమ్మాయి కావాలో ఎంపిక చేసుకోండి.. అని సందేశం వచ్చింది.  వివాహితుడు తనకు అలాంటి ఆలోచన లేదని సమాధానమిచ్చాడు..  అంతే.. ఏదో ఒక అమ్మాయిని ఎంపిక చేసుకోవాల్సిందే.. లేదంటే నీ అంతు తేలుస్తాం… బతుకు బజారుకీడుస్తాం.. అంటూ అవతలి వ్యక్తులు బెదిరించడం మొదలు పెట్టారు.

అంతేకాదు.. సదరు వ్యక్తి తన భార్యతో దిగిన చిత్రాన్ని వాట్సాప్ డీపీ గా పెట్టుకున్నాడు.  ఆ ఫోటో ని  మార్ఫింగ్ చేసి పంపించారు. డబ్బులు ఇవ్వకుంటే ఆ ఫోటో ని వైరల్ చేస్తామని బెదిరించారు. 

ఇలాంటిదే ఇంకో కేసులో ఒక వ్యక్తి తన భార్యతో దిగిన ఫోటోని వాట్స్ అప్ డిపిగా పెట్టుకున్నాడు సైబర్ మోసగాళ్ళు ఆ చిత్రాన్ని స్క్రీన్షాట్ తీసుకుని అందులోని భార్య చిత్రాన్ని మరో వ్యక్తితో ఉన్నట్లు మార్ఫింగ్ చేసి  భర్తకు పంపించారు. ఈ ఫోటోలు వైరల్ అవ్వకుండా ఉండాలి అంటే డబ్బులు పంపించాలని డిమాండ్ చేశారు.  కుటుంబం పరువు పోతోందన భయపడిన ఆ భాదితుడు రూ.1.50 లక్షల మొత్తం ఆ మోసగాళ్లకు బదిలీ చేశాడు. అంతటితో ఆగకుండా వారు మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.

దారుణం.. పాఠ‌శాల‌కు వెళ్తున్న‌విధ్యార్ధిని కిడ్నాప్.. ఆపై ఆత్యాచారం

హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో రోజూ ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఫేస్బుక్,  insta,  ట్విట్టర్  వంటి మాధ్యమాల్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపేవారు.  స్నేహం పేరుతో ఆయా సామాజిక మాధ్యమాల్లో ఇతరులు పెట్టే పోస్టులు ఫోటోలు తీసుకుని మోసగాళ్లు వారి ఖాతాలకు డీపీ లుగాపెట్టుకునేవారు. ఎవరి ఫోటో అయితే డిపిగా పెట్టుకున్నారో వారి స్నేహితులు, బంధువులకు చికిత్స నిమిత్తం డబ్బులు కావాలని సందేశాలు పంపేవారు. 

ఇలా డబ్బులు దండుకున్న కేసులు ఎన్నో నమోదయ్యాయి. ఇప్పుడు కొత్తగా వాట్స్అప్ డీపీ తీసుకుని వాటిని మార్ఫింగ్ చేసి... డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని.. సైబర్ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు. రాజస్థాన్ కు చెందిన ముఠాలు ఇలాంటి మోసాలకు పాల్పడేవి. ఇప్పుడు పంథా మార్చినట్లుగా కనిపిస్తోందన్నారు.

స్పందిస్తే అంతే..
అపరిచిత వ్యక్తుల నుంచి ‘కాల్ గర్ల్స్ ప్రొవైడ్’ ఇతర పేర్లతో ఫోన్ కు ఏవైనా లింకులు వస్తే వాటిపై క్లిక్ చేయకుండా వెంటనే డిలీట్ చేయాలి. ఒకవేళ ఆ లింకులపై క్లిక్ చేస్తే అవతల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినా.. స్పందించకుండా ఉంటే మంచిది. ఆ ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసేయాలి.. ఎప్పుడైతే మీరు స్పందించడం మానేస్తారో.. లేదా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తారో.. ఆ మోసగాళ్లు మరో ప్రయత్నంలోకి వెళ్ళిపోతారు.  స్పందిస్తే భయపడినట్లు గ్రహించి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెడతారు జాగ్రత్త.

చాలామంది వారి వాట్స్అప్  సోషల్ మీడియా అకౌంట్లకు భార్యభర్తలు దిగిన ఫోటోలను  డిపిలుగా పెట్టుకుంటారు.  కొందరైతే  రోజు 2,3 డీపీలు మారుస్తుంటారు.  ఇదే సమస్యలు తెచ్చిపెడుతోంది. సోషల్ మీడియా ఖాతాలను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేసినప్పుడు అందులోని ఫోటోలు తీసుకుని, మార్ఫింగ్ చేస్తుంటారు. తెలియని లింకులపై క్లిక్ చేయొద్దు. సామాజిక మాధ్యమ అకౌంట్ లకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ ను అంగీకరించవద్దు’ అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కృష్ణ సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios