అమరావతి: ఈ నెలాఖరు వరకు కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తి కానుందని  ఎఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ తెలిపారు.

బుధవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కొత్త పీసీసీ చీఫ్ కోసం సంప్రదింపులు ప్రక్రియ మొదలౌతోందని ఆయన చెప్పారు. 
ఇప్పటివరకు ఎవరిపేరు ఫైనల్ కాలేదన్నారు. 

పీసీసీ చీఫ్ పదవి కోసం ఇప్పటివరకు కసరత్తు జరగలేదన్నారు. ఇప్పటివరకు జరగిందంతా ప్రచారమేనని ఆయన ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ పదవి కోసం రాష్ట్రంలోని పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ బుధవారం నాడు హైద్రాబాద్ కు రానున్నారు.

also read:రంగంలోకి ఠాగూర్: టీపీసీసీకి కొత్త చీఫ్ ఎంపికకు నేతల అభిప్రాయ సేకరణ

దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితం రాలేదు. వరుస ఓటములతో ఆ పార్టీ కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. చాలా కాాలంగా పీసీసీ చీఫ్ గా కొత్త వారిని నియమించాలనే డిమాండ్ నెలకొంది. దీంతో కొత్త నేత ఎంపిక కోసం ఠాగూర్ పార్టీ నేతల నుండి అభిప్రాయాలను సేకరించనున్నారు.