రంగంలోకి ఠాగూర్: టీపీసీసీకి కొత్త చీఫ్ ఎంపికకు నేతల అభిప్రాయ సేకరణ

First Published Dec 8, 2020, 3:12 PM IST

టీపీసీసీ చీఫ్ గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లగుల్లాటు పడుతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఈ నెల 9వ హైద్రాబాద్ కు రానున్నారు.

టీపీసీసీ చీఫ్ పదవి కోసం  నేతల అభిప్రాయాలను ఈ నెల 9వ తేదీ నుండి తీసుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్  ఈ నెల 9వ తేదీన హైద్రాబాద్ కు రానున్నారు.

రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా మాణికం ఠాగూర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేదు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడ దక్కలేదు. అంతేకాదు ఆ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా  మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ భావించింది. కానీ ఆ పార్టీకి ఈ ఎన్నికలు కూడ నిరాశనే మిగిల్చాయి. రెండు స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. దీంతో టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.  గతంలో కూడ ఆయన రాజీనామా చేసినా పార్టీ నాయకత్వం ఆయన రాజీనామాను ఆమోదించలేదు.

పీసీసీ చీఫ్ పదవికి కొత్తవారిని ఎంపిక చేయాలనే డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతోంది. పలువురు నేతలు కూడ ఈ పదవిని ఆశిస్తున్నారు.

పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న నేతలంతా లాబీయింగ్ చేసుకొంటున్నారు.  పీసీసీ చీఫ్ పదవికి పోటీ పడుతున్న నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు.

మాజీ మంత్రి శ్రీధర్ బాబును అందరూ నేతలు సమర్ధిస్తున్నారు. అందరితో సమన్వయం చేసుకొనే తత్వం శ్రీధర్ బాబుకు ఉందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది.

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధు యాష్కీ, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు. మల్లు భట్టి విక్రమార్క, వీహెచ్, దామోదర రాజనర్సింహ తదితరుల పేర్లు పీసీసీ రేసులో ఉన్నట్టుగా  పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న నేతల నుండి మాణికం ఠాగూర్ అభిప్రాయాలను సేకరించనున్నారు. నేతల అభిప్రాయాలను ఠాగూర్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు సమర్పిస్తారు.

మెజారిటీ నేతలు ఎవరి పేరును సూచిస్తే వారే పీసీసీ చీఫ్ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?