Asianet News TeluguAsianet News Telugu

Loan apps case: లోన్ యాప్స్‌ కేసులో మరో కొత్త కోణం.. రూ. 14 వేల కోట్లకు విదేశాలకు.. !

లోన్స్ యాప్ కేసులో (loan apps) మరో కొత్త కోణం వెలుగుచూసింది. చైనా కంపెనీలు రూ. 14 వేల కోట్లను విదేశాలకు తరలించినట్టుగా తేలింది. హాంకాంగ్, సింగపూర్, మారిషస్ దేశాలకు ఈ డబ్బులను తరలించినట్టుగా తెలుస్తోంది. 

new angle in loan app case 14000 crore transfer to foreign countries
Author
Hyderabad, First Published Dec 18, 2021, 11:58 AM IST

లోన్స్ యాప్ కేసులో (loan apps) మరో కొత్త కోణం వెలుగుచూసింది. చైనా కంపెనీలు రూ. 14 వేల కోట్లను విదేశాలకు తరలించినట్టుగా తేలింది. హాంకాంగ్, సింగపూర్, మారిషస్ దేశాలకు ఈ డబ్బులను తరలించినట్టుగా తెలుస్తోంది. నకిలీ ఎయిర్ వే బిల్లులు, సర్టిఫికేట్లతో చైనా కంపెనీలు ప్రభుత్వానికి టోకరా వేశాయి. 15cb నకిలీ వే బిల్లులు సృష్టించి విదేశాలకు నగదు మళ్లించినట్టుగా దర్యాప్తులో తేలింది. బ్యాంకు అధికారుల సమాచారంతో సీసీఎస్‌లో కేసు నమోదు అయింది. మరోవైపు లోన్ యాప్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈడీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. 

ఇక, మొబైల్ యాప్‌ల ద్వారా చైనాకు చెందిన ఇన్‌స్టంట్ మైక్రో లోన్ సంస్థలు మనీలాండరింగ్ స్కామ్‌ను Enforcement Directorate విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (పీసీఎఫ్‌ఎస్) ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ. 51.22 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకన్నారు. గతంలోను ఈ కేసుకు సంబంధించి రూ. 106.93, రూ. 131.11 కోట్లను ఈడీ జప్తు చేసింది. దీంతో ఈ కేసులో మొత్ం స్వాధీనం చేసుకన్న మొత్తం రూ. 288 కోట్లకు చేరింది. మరోవైపు ఆర్బీఐ, ఐటీ డిపార్ట్‌మెంట్ కూడా సీ ఫైనాన్షియల్ సర్వీసెస్ విచారణను ప్రారంభించారు. 

ఇక, లోన్ యాప్స్ నిర్వాహకులు కాల్ సెంటర్‌ల ద్వారా ఫోన్‌లు చేసిన యాప్స్ ద్వారా ఇన్‌స్టంట్‌ లోన్ అందజేస్తారు. ఆ తర్వాత డబ్బులు చెల్లించాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తారు. ఈ క్రమంలోనే బెదిరింపులకు దిగుతారు. నిబంధనలుకు విరుద్దంగా వారి పర్సనల్‌ డేటాను సేకరించి బదనాం చేస్తారు. ఈ క్రమంలోనే కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల చెల్లించలేక లోన్ యాప్స్ ఉచ్చులో చిక్కుకుని తెలంగాణలో కనీసం ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios