హైదరాబాద్: నేరేడ్‌మెట్  పరిధిలోని 136 డివిజన్ ఎన్నికల ఫలితాలను పురస్కరించుకొని చోటు చేసుకొన్న వివాదంపై  రిటర్నింగ్ అధికారి లీనా స్పందించారు.

బుధవారం నాడు లీనా మీడియాతో మాట్లాడారు. పలు పార్టీల అభ్యర్ధులు తనపై ఆరోపణలు చేశారని చెప్పారు. తాను ఏ పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు.

also read:నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో టీఆర్ఎస్ విజయం: కంటతడి పెట్టిన బీజేపీ అభ్యర్ధి ప్రసన్న

పలు పార్టీల అభ్యర్ధులు తనపై చేసిన ఆరోపణలతో తాను కలత చెందినట్టుగా తెలిపారు.ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొందరు తనను దూషించారన్నారు.  తనను దూషించిన కాల్ రికార్డులు కూడ తన వద్ద ఉన్నట్టుగా చెప్పారు.ఈ విషయమై ఎన్నికల సంఘానికి కూడ నివేదిక ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు.ఎన్నికల విధులను తాను పారదర్శకంగా నిర్వర్తించినట్టుగా చెప్పారు.

ఈ నెల 4వ తేదీన ఈ డివిజన్ ఎనన్నికల ఫలితాన్ని ప్రకటించలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఈ డివిజన్ లో స్వస్థిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉన్న బ్యాలెట్ పేపర్లను ఎన్నికల అధికారులు లెక్కించారు. ఈ డివిజన్ లో  టీఆర్ఎస్ అభ్యర్ధి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించినట్టుగా రిటర్నింగ్ అధికారి లీనా ప్రకటించారు. ఎన్నికైనట్టుగా ధృవీకరణ పత్రం కూడా అందించారు.