Asianet News TeluguAsianet News Telugu

నీట్ పరీక్షకు హాజరయ్యేవారికి డ్రెస్ కోడ్: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

నీట్ ప్రవేశ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు.  వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

NEET begins today amid strict Covid-19 protocols at exam centres
Author
Hyderabad, First Published Sep 13, 2020, 1:42 PM IST


హైదరాబాద్: నీట్ ప్రవేశ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు.  వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలు రాసే అభ్యర్థులను ఉధయం 11 గంటల నుండే పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇస్తారు. విద్యార్థులు ఏ సమయంలో పరీక్షా కేంద్రాల్లోకి హాజరు కావాలో ముందే వారికి సమాచారం అందించారు.

పరీక్ష రాసే వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్ధులను పరీక్షించిన తర్వాతే పరీక్షా హాల్ లోకి అనుమతి ఇస్తున్నారు. అభ్యర్థులు తమ వెంట మాస్కులు, శానిటైజర్లు, నీళ్ల బాటిల్స్ ను అనుమతిస్తారు.

ఈ ఏడాదిలో తెలంగాణ నుండి 55 వేల మంది హాజరుకానున్నారు. ఒక్కో గదిలో 12 మంది పరీక్ష రాసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ అభ్యర్ధులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. నీట్ రాసే విద్యార్థులు హాఫ్ హ్యాండ్స్ దుస్తులు మాత్రమే వేసుకోవాలి.  ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 61,890 మంది నీట్ పరీక్ష రాయనున్నారు. 

దేశంలో ఈ పరీక్షల కోసం 15.97  మంది ధరఖాస్తు చేసుకొన్నారు.  కరోనాను పురస్కరించుకొని నీట్ పరీక్ష రాసేందుకు దేశ వ్యాప్తంగా 3,843 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఏపీ రాష్ట్రంలో నీట్ పరీక్ష రాసే వారి కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios