వికారాబాద్ పై ఆందోళన వద్దు : మంత్రి మహేందర్ రెడ్డి

Need not to be panic on Vikarabad: Mahender Reddy
Highlights

భరోసా ఇచ్చిన మంత్రి పట్నం

వికారాబాద్ జిల్లా ను జోగులాంబ జోన్ లో కలిపే అంశంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. ఈ సమస్యపై, ప్రజల మనోభావాలను సీఎం కేసీఆర్ కు మరోసారి నివేదిస్తానని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలోని మక్త వెంకటాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

నాలుగేళ్ళ కాలంలో ప్రభుత్వం గత 50 ఏళ్ళ లో చేయని అభివృద్ధి, సంక్షేమం కోట్లాది నిధులతో చేపట్టామన్నారు. మిషన్ కాకతీయ పనులు సకాలంలో పూర్తి చేయించి పరిగి నియోజకవర్గం సస్యశ్యామలం చేస్తామన్నారు. లింగంపల్లి,  మక్త వెంకటాపూర్ గ్రామాల్లో రూ. కోటీ 66 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ప్రారంభించారు రవాణా మంత్రి మహేందర్ రెడ్డి.

మక్త వెంకటాపూర్ లో బంగారు మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. మంత్రి మహేందర్ రెడ్డి కి పాటలు,నృత్యాలతో స్వాగతం పలికారు గిరిజనులు. రాష్ట్రం లో 500 జనాభాగల గిరిజన తాండాల ను ప్రత్యేక పంచాయితీ లుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు పట్నం. గిరిజన తాండాల కు మౌలిక సదుపాయాలు, రవాణా, ,కమ్యూనికేషన్ సదుపాయాలకు ఎన్ని నిధులైనా అందిస్తామన్నారు.

మక్త వెంకటాపూర్ మీదుగా పరిగి - మహబూబ్ నగర్, మక్త వెంకటాపూర్ - ముంబాయి

 బస్సు సర్వీస్ త్వరలో ప్రారంభిస్తామన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా, వ్యవసాయం కోసం ఎకరాకు రూ. 4 వేల పెట్టుబడులు రైతుబంధు పథకం ద్వారా అందించి రూ. 5 లక్షల బీమా ఏర్పాటు చేస్తూ వ్యవసాయం లాభసాటిగా చేస్తున్నట్లు వివరించారు.

loader