Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌ జవహర్ నగర్ లో యువతిని వివస్త్ర చేసిన కేసు: వారం రోజుల్లో నివేదిక కోరిన జాతీయ మహిళ కమిషన్

హైద్రాబాద్ నగరంలో యువతిని వివస్త్ర చేసిన ఘటనపై  జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది.ఈ ఘటనపై  వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని  తెలంగాణ డీజీపీని ఆదేశించింది.

NCW orders to  DGP To give  Report within seven days on  Woman  molested, stripped Naked in Hyderabad lns
Author
First Published Aug 9, 2023, 9:53 AM IST

హైదరాబాద్: నగరంలోని యువతిని  వివస్త్రను  చేసిన  ఘటనను జాతీయ మహిళ కమిషన్ సీరియస్ గా తీసుకుంది. వారం రోజుల్లో ఈ విషయమై  నివేదిక  ఇవాలని  తెలంగాణ డీజీపి అంజనీ కుమార్ ను  ఆదేశించింది.  యువతికి న్యాయం చేయాలని కోరింది.రెండు  రోజుల క్రితం  హైద్రాబాద్ జవహర్ నగర్  బాలాజీ నగర్ బస్టాండ్ వద్ద యువతి పట్ల  పెద్దమారయ్య అనే వ్యక్తి  అత్యంత దారుణంగా వ్యవహరించాడు.  యువతిని వివస్త్రగా మార్చాడు.  యువతిని అసభ్యంగా తాకడంతో  ఆమె  అతడిని కొట్టింది.

 

పోలీసులకు  ఫిర్యాదు చేస్తానని  వార్నింగ్ ఇచ్చింది. దీంతో  కోపం పట్టలేక  పెద్దమారయ్య  యువతిని వివస్త్రగా మార్చాడు.తనను కాపాడాలని యువతి  స్థానికులను  కోరింది. కానీ  ఎవరూ కూడ  తనను కాపాడేందుకు  రాలేదని బాధిత యువతి రెండు  రోజుల క్రితం మీడియాకు  తెలిపింది.  ఓ యువకుడు  ధైర్యం చేసి కాపాడేందుకు వస్తే  అతడిని చంపుతానని  బెదిరించాడని బాధితురాలు వాపోయింది.  అయితే ఈ దారుణాన్ని  ఆపకుండా  సెల్ ఫోన్లలో  స్థానికులు  రికార్డు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత స్థానిక మహిళలు యువతిపై కవర్ కప్పారు.

also read:వివస్త్రను చేస్తున్నా కాపాడలేదు, రికార్డు చేశారు: హైద్రాబాద్ జవహర్ నగర్ ఘటనపై బాధితురాలు

జరిగిన ఘటన గురించి  ఫోన్ లో బాధితురాలు  సోదరుడికి తెలిపింది.  దీంతో బాధిత యువతి కుటుంబ సభ్యులు బట్టలు తీసుకొచ్చారు.  బాధితురాలు నేరుగా  పోలీస్ స్టేషన్ కు వెళ్లి  ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు  పాల్పడిన నిందితుడు పెద్దమారయ్యను పోలీసులు అరెస్ట్  చేశారు. అయితే  తన తల్లిని  యువతి దూషించినందుకే  తాను  ఆమెను వివస్త్రను చేసినట్టుగా  నిందితుడు  మారయ్య  తమ దర్యాప్తులో చెప్పారని పోలీసులు  మీడియాకు  చెప్పారు. అయితే  మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డారా ఉద్దేశ్యపూర్వకంగా  చేశాడా అనే విషయమై  దర్యాప్తు  చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  ఈ తరహా ఘటనకు  కారణమైన పెద్ద మారయ్యను కఠినంగా శిక్షించాలని స్థానికులు, మహిళా సంఘాలు డిమాండ్  చేస్తున్నాయి.  ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీంతో  జాతీయ మహిళ కమిషన్ స్పందించింది.  ఈ ఘటనపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది.  బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని సూచించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios