హీరా మల్టీ కన్ స్ట్రక్షన్ సంస్థలో అక్రమంగా షేర్ల బదలాయింపు: ఎన్‌సీఎల్‌టీ గుర్తింపు
హీరా మల్టీ కన్ స్ట్రక్షన్ సంస్థలో అక్రమంగా షేర్ల బదలాయింపు చోటు చేసుకుంది. ఈ విషయమై బాధిలులు నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. బదలాయించిన షేర్లను తిరిగి బాధితులకు కేటాయించాలని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది.
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో భారీ కార్పోరేట్ స్కాం చోటు చేసుకుంది. రూ. 200 కోట్ల విలువైన కంపెనీ షేర్స్ ను కుటుంబసభ్యుల పేర్లపై బదలాయించుకున్నారని హీరా మల్టీ వెంచర్స్ పై బాధితులు ఫిర్యాదు చేశారు.
హీరా మల్టీ వెంచర్స్ లో 15 శాతంగా ఉన్న షేర్స్ ను 85 శాతానికి నిందితులు పెంచుకున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. సౌదీ రాజ కుటుంబీకుల వద్ద కీలక వ్యక్తులమని చెప్పుకుంటూ ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టుగా చెబుతున్నారని ఈ కథనం తెలిపింది. దీంతో బాధితులు నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. బాధితులను మోసం చేసి షేర్స్ ను అక్రమంగా తమ పేర్ల మీదికి బదిలీ చేయించుకున్నారని నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ గుర్తించిందని ఆ కథనం తెలిపింది. బాధితుల షేర్లకు తిరిగి అప్పగించాలని హీరా మల్టీ కంపెనీని ఆదేశించింది.
హీరా మల్టీ యాజమాన్యంపై హైద్రాబాద్ లో గతంలో కేసులు నమోదయ్యాయి. హైద్రాబాద్ లో సీఐడీ, ఈడీ కేసులు నమోదయ్యాయని ఆ కథనం వివరించింది. సీఐడీ కేసులో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. సౌదీకి చెందిన అబ్దుల్ రజాక్ అలియాస్ అథీ అలీపై హైద్రాబాద్ లో కేసు నమోదైనట్టుగా ఆ కథనం తెలిపింది. .వికారాబాద్ ఊటీ గోల్ప్ కోర్స్ కేసు విషయమై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.