Asianet News TeluguAsianet News Telugu

‘నేతి’పై వేటు

  • నయీం కేసులో సబంధాలున్న వారిపై చర్యలకు రంగం సిద్ధం
  • దీపావళి తర్వాత మండలి  డిప్యూటీ చైర్మన్ ఉద్వాసన

 

nayeem gangster

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో తొలి వికెట్  పడనుందా అంటే... అవుననే సమాధానమే వినిస్తోంది. నయాం నేరచరిత్రలో భాగం పంచుకున్న పలువురిపై వేటు వేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీపావళి తర్వాత ఒక్కరోపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తొంది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ రావుపై మొట్టమొదటగా వేటు పడనుందని తెలుస్తోంది. ఆయన స్థానంలో నారదాసు లక్ష్మణరావు డిప్యూటీ చైర్మన్‌గా పగ్గాలు చేపడుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నయీంతో అనేకమంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు అంటకాగినట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నయీంతో సంబంధాలున్న పలువురు నాయకులు, పోలీసు అధికారుల పేర్లు బయటకు వచ్చాయి. అంతేకాకుండా నయీం కేసు విచారిస్తున్న సిట్‌ కూడా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో నేతి విద్యాసాగర్‌ రావును పేరును ప్రస్తావించింది.

ఆయనకు నయీంతో సంబంధాలు ఉన్నాయని పలువురు బాధితులు సిట్‌ ముందు వెల్లడించారు. అంతేకాకుండా నయీం బంధువులు కూడా నేతి సాయంతో తాము సెటిల్‌మెంట్లు చేసినట్టు వెల్లడించారని సమాచారం. నేతి పై వేటు నేపథ్యంలో ఇతర రాజకీయ నాయకులపైనా చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నయీం కేసులో తాము పారదర్శకంగా వ్యవహరిస్తామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెబుతుండడంతో నయీంతో సంబంధం ఉన్న గులాబీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios