హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా  నవీన్ రావు ఏకగ్రీవంగా న్నికయ్యారు. నవీన్ రావు ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఆయన ఎన్నికైనట్టుగా ఈసీ శుక్రవారం నాడు ప్రకటించింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి టీఆర్ఎస్ నుండి నవీన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ పదవికి ఇతర పార్టీల నుండి నామినేషన్ దాఖలు కాలేదు.  నవీన్ రావు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

 గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి మైనంపల్లి హన్మంతరావు టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించడంతో  ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ పదవికి నవీన్ రావును కేసీఆర్ ఎంపిక చేశాడు. గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు కూడ ఎమ్మెల్సీ పదవికి పరిశీలనలో ఉంది. కానీ, కేసీఆర్ నవీన్ రావు వైపు మొగ్గు చూపాడు.

ఎమ్మెల్సీగా ఎన్నికైనందున తర్వాత నవీన్ రావు, మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారంనాడు నివాళులు అర్పించారు.