నవీన్ హత్య కేసు.. హరిహరకృష్ణను తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్.. కొనసాగుతున్న పోలీసుల విచారణ..

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Naveen murder case police reconstruct the crime scene with Harihara Krishna

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. హరిహరకృష్ణను శుక్రవారం పోలీసులు కస్టడీలోని తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఎల్‌బీనగర్‌లోని ఎస్‌వోటీ కార్యాలయానికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి నేడు రెండు రోజు హరిహరకృష్ణను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున హరిహరకృష్ణను ఘటన స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టారు. హత్య జరిగిన సమయంలో ఏం జరిగిందనే వివరాలను అడిగి  తెలుసుకున్నారు. 

నవీన్ హత్య జరిగిన తర్వాత హరిహరకృష్ణ.. నేరుగా తన సోదరి ఇంటికి వెళ్లిన నేపథ్యంలో పోలీసులు నేడు అతడినికి అక్కడికి తీసుకెళ్లారు. హత్య జరిగిన తర్వాత సోదరి ఇంటికి చేరుకున్న హరిహరకృష్ణ అక్కడ ఏం చేశాడు?  ఇంట్లో వాళ్లతో ఏం చెప్పాడనే వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో నవీన్ హత్య వెనక ఉన్నది ఎవరు?, హరిహరకృష్ణ ఒక్కడే ఈ హత్య చేశాడా? అతడికి ఎవరైనా సహకరించారా? వంటి కోణాల్లో  పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అబ్దుల్లాపూర్‌మె‌ట్ వరకు నవీన్‌ను తీసుకొచ్చింది ఎవరు? అనే సమచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. 

నవీన్ హత్యకు సంబంధించి అన్ని ఆధారాలతో పాటు.. ఇందులో యువతి పాత్ర గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నవీన్‌ను ఏడు  రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలో.. పోలీసులు హత్యకు సంబంధించి అన్ని విషయాలపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టేందుకు యత్నిస్తున్నారు. 

ఇక, ఇంటర్మీడియట్ చదివే రోజుల నుంచే నవీన్, హరిహరకృష్ణలు స్నేహితులు. వీరిద్దరూ ఒకే కాలేజీలో  చదువుకున్నారు. ఇంటర్ లో చదువుకునే రోజుల్లోనే  పరిచయం ఉన్న అమ్మాయితో  వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమ అంశమే  వీరిద్దరి మధ్య అగాధాన్ని పెంచింది. ఈ క్రమంలో నవీన్ పై   హరిహరకృష్ణ   అక్కసును పెంచుకున్నాడు. నవీన్ ను హత్య చేస్తే  లవర్ తనకు దక్కుతుందని  హరిహరకృష్ణ భావించాడు. దీంతో  నవీన్ ను హైద్రాబాద్ కు రప్పించి హత్య  చేసినట్టుగా  పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ విషయాన్ని హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో  పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. నవీన్‌ను హత్య చేసిన విషయాన్ని  హరిహరకృష్ణ తన స్నేహితుడు, స్నేహితురాలు, తండ్రికి  చెప్పాడు. ఇంత జరిగినా వీరిలో ఏ ఒక్కరు కూడా పోలీసులకు సమాచారం అందించకపోవడంతో.. ఉన్నతాధికారులు ఈ ముగ్గురిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అన్నింటికి మించి హరిహరకృష్ణ స్నేహితురాలు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇప్పటికే మూడు సార్లు ఆమెను విచారించగా.. నోరు విప్పకపోవడంతో పోలీసులు ఆమెను సఖి సెంటర్‌లో కౌన్సెలింగ్‌కు పంపారు. అయినప్పటికీ ఆ అమ్మాయి తీరు మారలేదని సమాచారం.

పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. అమ్మాయి విషయంలో నవీన్‌పై పగ పెంచుకున్న హరిహరకృష్ణ  అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనకు ఏం తెలియనట్టుగా సైలెంటుగా ఉన్న హరిహరకృష్ణ కొద్ది రోజులకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా  ఉన్న హరిహరకృష్ణను కస్టడీ కోరుతూ పోలీసులు రంగారెడ్డి జిల్లా  కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే పోలీసులు 8 రోజులు హరిహరకృష్ణను కస్టడీకి ఇవ్వాలని కోరగా..  రంగారెడ్డి  జిల్లా కోర్టు ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios