కుంగిన లక్ష్మీ బ్యారేజీ: రేపు పరిశీలించనున్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా  ఉన్న లక్ష్మీ బ్యారేజ్ ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మెన్ అనిల్ జైన్ నేతృత్వంలోని టీమ్ రేపు పరిశీలించనుంది.

National Dam safety authority team studying damage to Medigadda Barrage bridge on october 24 lns


భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న లక్ష్మీబ్యారేజ్ ను  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మెన్ అనిల్ జైన్ నేతృత్వంలోని టీమ్ ఈ నెల  24న  పరిశీలించనుంది.భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్ పూర్ మండలంలో గల లక్ష్మీబ్యారేజీ ఈ నెల 21న కుంగిపోయింది.   మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీలోని 20 వ పిల్లర్ కుంగిపోయిందని  ఇరిగేషన్ అధికారులు గుర్తించారు.   ఈ బ్యారేజీని  అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం రేపు పరిశీలించనుంది.

లక్ష్మీ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడానికి గల కారణాలపై  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్ దర్యాప్తు చేయనుంది. లక్ష్మీ బ్యారేజీ కుంగిపోవడంపై  కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  లేఖరాశారు.  రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందాన్ని పంపాలని ఆ లేఖలో కోరారు  కిషన్ రెడ్డి. దీంతో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం  డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందాన్ని పంపింది.  రేపు బ్యారేజీని సందర్శించిన తర్వాత కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు  డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందం  నివేదిక అందించనుంది.

బ్యారేజీ కుంగిపోవడంపై  కేసీఆర్ సర్కార్ పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  బీజేపీ, కాంగ్రెస్ నేతలు  కేసీఆర్ తీరుపై మండిపడుతున్నారు.  మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  ఈటల రాజేందర్ లు  బ్యారేజీని పరిశీలించారు.

also read:మేడిగడ్డ బ్యారేజ్ ఘటన.. సెఫ్టీపై ఆందోళన.. ఆరుగురు నిపుణులతో కేంద్రం కమిటీ..

గోదావరికి వరదలు వచ్చిన సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మోటార్లు  ముంపునకు గురయ్యాయి.ఇప్పుడు  లక్ష్మీ బ్యారేజీ  పిల్లర్లు కుంగిపోవడాన్ని  కూడ విపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు.ఇప్పటికే ఈ బ్యారేజీపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ బ్యారేజీపై నుండి మహారాష్ట్రకు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అంతేకాదు ఈ ప్రాంతంలో  పోలీసులు  144 సెక్షన్ ను విధించారు. ఇదిలా ఉంటే బ్యారేజీలో ప్రస్తుతం  10 టీఎంసీ నీరుంది. బ్యారేజీకి చెందిన  57 గేట్లను ఎత్తివేసి  నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios