పిల్లల్ని చంపేస్తామని బెదిరించి వేములవాడకు చెందిన వివాహితకు మహారాష్ట్రలో మూడో పెళ్లి చేసిన దారుణ ఘటన వెలుగు చూసింది. ఎనిమిది నెలల తరువాత ఆమె ఆ నరకం నుండి బయటపడడంతో విషయం బైటికి వచ్చింది.
పిల్లల్ని చంపేస్తామని బెదిరించి వేములవాడకు చెందిన వివాహితకు మహారాష్ట్రలో మూడో పెళ్లి చేసిన దారుణ ఘటన వెలుగు చూసింది. ఎనిమిది నెలల తరువాత ఆమె ఆ నరకం నుండి బయటపడడంతో విషయం బైటికి వచ్చింది.
వేములవాడ గాంధీనగర్‌కు చెందిన మహిళకు నాలుగేళ్ల కుమారుడు, ఏడాది పాప ఉన్నారు. తరచూ భర్తతో గొడవ కావడంతో విసుగెత్తిన ఆమె మార్చి 4న ఇంటి నుంచి వెళ్లిపోయింది. వేములవాడ నుంచి కామారెడ్డి, అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరింది. అక్కడే మూడు రోజులు గడిపింది.
ఒంటరి మహిళ అనే విషయాన్ని గమనించిన ఓ వృద్ధురాలు వివాహితను చేరదీసినట్లు నటించింది. పని ఇప్పిస్తానని చెప్పి మహారాష్ట్రలోని పర్భాని ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడే ఉన్న రాజారాం అనే వ్యక్తికి రూ. లక్షకు అమ్మేసింది. మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగిన ఈ దారుణం చివరికి సుఖాంతం అయ్యింది.
పది రోజుల పాటు తనవద్దే ఉంచేసుకున్న రాజారాం నాసిక్ ప్రాంతంలో ఉండే తన బావమరిది బాబు లక్ష్మణ్ జగపత్‌కు అప్పగించాడు. అప్పటికే జగపత్ కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. జగపత్ ను మూడో పెళ్లి చేసుకోవాలని, లేదంటే పిల్లల్ని ఎత్తుకొచ్చి అమ్మేస్తానని బెదిరించి బలవంతంగా పెళ్లి చేశాడు.
ఇదిలా ఉంటే మార్చిలో అదృశ్యమైన వివాహిత ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్న.. ఏమీ లభ్యం కాలేదు. ఓ రోజు ఆ మహిళ ఆడపడుచుకు, తెలియని నంబర్ నుంచి ఫోన్ రావడంతో విషయం బయటపడింది. ఫోన్ నంబర్ ఆధారంగా వేములవాడ పోలీసులు ఆ ప్రాంతాన్ని కనుగొన్నారు.
ఓ పోలీసు బృందం నాసిక్ చేరుకుని వివాహిత కోసం ఆరా తీసింది. ఆమెను మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని ఈనెల 28న వేములవాడకు తీసుకువచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు లక్ష్మణ్ జగపత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలకు వివాహితలు బయటికి వెళ్లిపోయి మాయ మాటలు చెప్పే వారి ఉచ్చులో పడవద్దని టౌన్ సీఐ వెంకటేశ్ ఈ సందర్భంగా సూచించారు. బంధువల సమక్షంలో సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 1, 2021, 8:56 AM IST