Asianet News TeluguAsianet News Telugu

రఘురామకృష్ణంరాజు కేసు:సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ప్రారంభం

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో మంగళవారం నాడు వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. 

Narsapuram MP Raghurama krishnam Raju examined by Secundrabad Army doctors team  lns
Author
Hyderabad, First Published May 18, 2021, 10:10 AM IST

హైదరాబాద్: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో మంగళవారం నాడు వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నాడు రాత్రి గుంటూరు జైలు నుంి రఘురామకృష్ణంరాజును సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల పర్యవేక్షణకు హైకోర్టు రిజిస్ట్రీ నాగార్జునను తెలంగాణ హైకోర్టు నియమించింది.ముగ్గురు డాక్టర్ల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైద్య పరీక్షలను  వీడియో రికార్డు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.   

also read:నన్ను చంపేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర: రఘురామ కృష్ణమ రాజు

తొలుత షుగర్ తో పాటు జ్వరంతో ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయమై వైద్యులు పరీక్షించారు. దీంతో పాటు జనరల్ చెకప్ చేశారు. కస్టడీలో తనపై దాడి చేశారని ఆయన ఆరోపణలు చేసిన నేపథ్యంలో  ఈ విషయమై కూడ వైద్యులు  పరీక్షించనున్నారు. ఈ నెల 14వ తేదీన  కస్టడీలో పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని రఘురామకృష్ణంరాజు విజయవాడ కోర్టుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వైద్య పరీక్షలకు కోర్టు  ఆదేశం మేరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 


 

Follow Us:
Download App:
  • android
  • ios