మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్‌కు ప్రమాదం తప్పింది. కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయంలో ఆయన స్పీడ్‌ బోటును పరిశీలించి దిగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగా వచ్చిన స్పీడ్‌బోటులో ఎల్‌ఎండీలో ప్రయాణించి తిరిగి ఒడ్డుకు చేరుకున్న అనంతరం బోటు నుంచి దిగుతున్న సమయంలో ఒక్కసారిగా పట్టుజారి ఆయన నీటిలో పడిపోయారు. 

అయితే లైఫ్‌జాకెట్‌ వేసుకోవడం.. అక్కడ పెద్దగా లోతులేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే సిబ్బంది ఆయన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా కమలాకర్‌ స్పీడ్‌ బోటు ప్రారంభోత్సవానికి కాకుండా.. దాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.