కేసీఆర్ కు మోడీ కితాబు: టీడీపి నేతలపై విసుర్లు

First Published 20, Jul 2018, 10:49 PM IST
Narendra Modi praises KCR
Highlights

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాలను ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు శుక్రవారం రాత్రి లోకసభలో ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించారు. 

అమరావతి:  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాలను ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు శుక్రవారం రాత్రి లోకసభలో ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించారు. 

విభజన తర్వాత ఎపి, తెలంగాణ మధ్య ఎన్నో వివాదాలు ముందుకు వచ్చాయని ఆయన చెప్పారు. ఇరు రాష్ట్రాలకు తాను, గవర్నర్ సర్ది చెబుతూ వచ్చామని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కొంత పరిణతితో వ్యవహరించారని ఆయన అన్నారు. 

ఏదో ఒక పేచీతో తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేస్తూ వచ్చేవారని అన్నారు. విభజన తీరును నరేంద్ర మోడీ తీవ్రంగా తప్పు పట్టారు. తల్లి చంపి బిడ్డును తీశారని తాను అప్పట్లోనే అన్నానని ఆయన గుర్తు చేశారు. తెలుగు తల్లి స్ఫూర్తిని కాపాడాలని ఇప్పటికీ అంటున్నట్లు ఆయన తెలిపారు. 

loader